ఇప్పటికే పదుల సంఖ్యలో అవార్డులు గెలుచుకున్న 'బలగం' ఖాతాలో మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి చేరాయి. ఈసారి ఆ ఇద్దరికీ ఈ పురస్కారాలు దక్కడం విశేషం.
ఎప్పుడూ ఏ సినిమా క్లిక్ అవుతుందో.. ఎంత పెద్ద హిట్ అవుతుందనేది అస్సలు ఊహించలేం. వందల కోట్లు పెట్టుబడితో తీసిన మూవీస్ ఫట్ మని బుడగల్లా పేలిపోతుంటాయి. ఏ మాత్రం అంచనాల్లేకుండా తీసిన కొన్ని మూవీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. అలా చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ స్టోరీతో తీసిన ‘బలగం’.. ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇంతకీ అవేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ బంధాల నేపథ్యంతో ‘జబర్దస్త్’ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అందరితోనూ కంటతడి పెట్టించింది. కుటుంబం మొత్తం కలిసుంటేనే దాన్ని బలగం అంటారు అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమాకు ఇప్పటికే లాస్ ఏంజిల్స్ అవార్డ్స్ లో ఉత్తమ డైరెక్టర్, సినిమాటోగ్రఫీకి పురస్కారాలు వరించాయి. 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ జ్యూరీ కేటగిరీలోనూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో పురస్కారం దక్కింది. రీసెంట్ గా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో ‘బలగం’ మూవీపై ప్రశ్న వచ్చింది. ఇలా ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరే వినిపిస్తోంది.
రిలీజై నెలలు దాటుతున్న ‘బలగం’ హవా అస్సలు తగ్గట్లేదు. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్న ఈ మూవీ ఖాతాలో మరో రెండు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి చేరాయి. ఈ చిత్రంలో నటించిన ప్రియదర్శికి ఉత్తమ నటుడు, కేతిరి సుధాకర్ రెడ్డి(కొమురయ్య)కి ఉత్తమ సహాయనటుడు విభాగంలో స్వీడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డులు వరించాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ వేణు ట్విట్టర్ షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. మరి ‘బలగం’కి అవార్డుల పరంపర కొనసాగుతుండటంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Congratulations thaatha n sayilooo🥰🥰#balagam @PriyadarshiPN @DilRajuProdctns pic.twitter.com/m5B6QxRuyi
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 8, 2023