అనుబంధాలు, కాకి చుట్టూ అల్లిన బలగం కథలో భావోద్వేగాలెన్నో. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కరినీ ఏడ్పింపించింది. ‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా..’అంటూ సాగే ఈ అద్భుతంగా పాడారు మొగిలయ్య దంపతులు. అయితే..
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా బలగం. ఈ సినిమా కుటుంబ వ్యవస్థపై ఎంతటి ప్రభావం చూపించిందంటే.. కలహాలతో, అపార్థాలతో విడిపోయిన అన్నాదమ్ములు, అన్నాచెల్లెళ్లు కలిసిపోయారు. శత్రువులుగా మారిన కుటుంబాలు ఏకమయ్యాయి. ఈ సినిమాను వ్యక్తిగతంగానూ కదిలించింది. కాకి చుట్టూ అల్లిన కథలో భావోద్వేగాలెన్నో. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కరినీ ఏడ్పింపించింది. ‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా..’అంటూ సాగే ఈ అద్భుతంగా పాడారు మొగిలయ్య దంపతులు. అయితే మొగిలయ్య కొంతకాలంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. గత రెండు దశాబ్దాలుగా ఈ దంపతులు బుర్రకథలు చెప్పుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. అయితే కరోనా టైంలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. దీంతో ఆయనకు డయాలసీస్ చేయాల్సిన పరిస్థితి. ఆయన కష్టం తెలిసి పలువురు దాతలు తమకు తోచిన ఆర్థిక సాయం చేస్తున్నారు. తాజాతా తెలంగాణ సర్కార్ కూడా ఆదుకుంది. అతడి అనారోగ్యానికి అయ్యే ఖర్చును కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుంది. అయితే తాజాగా ఆయనకు దళిత బంధు పథకాన్ని అందించింది.
బలగం ‘మొగిలయ్య’కు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును శాంక్షన్ చేసిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం నర్సంపేటలోని తన క్యాంపు కార్యాలయానికి మొగిలయ్యను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలిపించుకుని యోగక్షేమాలు ఆరా తీశారు. అనంతరం మొగిలయ్య దంపతులను ఎమ్మెల్యే దంపతులు సత్కరించారు. ఈ సందర్భంగా దళితబంధు మంజూరు పత్రాలను వారికి అందించారు. దళితబంధు పథకం కింద మొగిలయ్యకు రూ.10 లక్షల నగదు సహాయం అందనుంది. ఆ డబ్బులతో ఆర్థికంగా చేదోడుగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేకు మొగిలయ్య దంపతులు కృతజ్షతలు తెలిపారు.