వెండి తెర నుండి జబర్దస్త్ షో వైపు వెళ్లాడు కమెడియన్ వేణు. అనంతరం అనూహ్యంగా ఆ షో నుండి తప్పుకున్నాడు. తనలోని టాలెంట్‌తో దర్శకుడిగా మారి.. బలగం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించాడు. తాజాగా బడా హీరోను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
వెండితెరపై గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై మెరిసిన నటుడు కమ్ కమెడియన్ వేణు అలియాస్ జబర్దస్త్ వేణు. జబర్దస్త్ షోకు ముందు పలు సినిమాల్లో చేసినా.. ప్రభాస్ మున్నా సినిమాలో చేసిన టిల్లు క్యారెక్టర్‌కు మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత ఏ సినిమా చేసినా పేరు రాకపోవడంతో జబర్దస్త్ షో వైపు వెళ్లాడు. అక్కడ మంచి కామెడీని పండించాడు. అనంతరం అనూహ్యంగా ఆ షో నుండి తప్పుకున్నాడు. తనలోని టాలెంట్‌తో దర్శకుడిగా మారి.. బలగం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించాడు. ఈ సినిమా గురించి ఇండస్ల్రీ చర్చించుకునేలా చేయడమే కాదూ.. ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వరిస్తున్నాయి. అదే సమయంలో వేణుతో సినిమాలు చేసేందుకు సిద్ధమౌవుతున్నారు. అయితే అతడు మాత్రం ఓ బడా హీరోతో సినిమా చేయాలనుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా నందమూరి బాలకృష్ణ. బాలయ్యతో తన తదుపరి సినిమా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ఆయన కోసం కథ రెడీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. బాలకృష్ణ అంటే ఊర మాస్ ఉండాల్సిందే. అటు మాస్, ఇటు క్లాస్‌ను మిళితం చేసి సున్నితమైన కథను వేణు సిద్దం చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ కథను బాలయ్య బాబుకు వినిపించగా.. ఆయన ఓకే చెప్పినట్లుగా సమాచారం. బలగంతో వేణుపై దర్శకుడిగా అంచనాలు పెరగడంతో పాజిటివ్‌గా రెస్పాన్స్ అయ్యారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రిలీజ్ తేదీ, ఇతర పూర్తి వివరాలను త్వరలో చిత్ర బృందం ప్రకటించనుంది. అలాగే జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా తదుపరి సినిమాల ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈ నేపథ్యంలో అప్పుడే ఈ సినిమా ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బలగం హిట్ తర్వాత.. వేణు తదుపరి చేయబోయే సినిమాకు కూడా నిర్మాతగా ఉంటానని దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పారు. బాలయ్య సినిమా ఓకే అయితే.. దాన్ని కూడా దిల్ రాజు నిర్మించనున్నారు. ఇది కనుక పట్టాలెక్కితే.. టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ షురూ అయినట్లే.