ఆర్ఆర్ఆర్.. ఈ ఒక్క సినిమా కోసం ఇండియన్ సినీ లోకం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా మూవీ పలు భాషల్లో, జనవరి 7న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉండగా, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో కూడా అంతే స్థాయిలో అదరగోడుతోంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది.
అది ఏమిటంటే.. ఇవాళ ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీని కోసం ఈ చిత్ర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానుల ఆశలకు నిరాశే ఎదురైయింది. ఇవాళ ముంబైలో జరిగే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈ వెంట్ ను లైవ్ టెలికాస్ట్ చేయట్లేదని RRR బృందం ప్రకటించింది. ఈ ఈవెంట్ ను మరో రోజు ప్రసారం చేస్తామని తెలిపింది. మరికొన్ని నగరాల్లో ఈ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ జరగనున్నాయని.. వాటిని లైవ్ ఇస్తామని తెలిపింది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఈ చిత్ర టీమ్ ట్విట్ చేసింది. అయితే ఈ ప్రోగ్రాంలో ఎన్టీఆర్, రాంచరణ్ డ్యాన్స్ చేయనున్నారని టాక్. ఆర్ఆర్ఆర్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
💥💥 #RoarOfRRRInMumbai pic.twitter.com/YfdAVSUiHV
— RRR Movie (@RRRMovie) December 19, 2021