ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అంత పెద్ద హిట్ కొట్టిన ఈ సినిమా కథ తనదే అంటూ ఓ రైటర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు.
ఓ వైపు వర్షాలు కురుస్తుంటే.. మరో వైపు కాసుల వర్షం కురిపిస్తుంది బేబి మూవీ. చిన్న సినిమాగా విడుదలై వసూళ్ల వరద సృష్టిస్తుంది. ఎక్కడ చూసినా.. బేబి మేనియానే. సోషల్ మీడియాలో అయితే.. ఇందులోని కొన్ని సీన్స్ రీల్స్ రూపంలో సందడి చేస్తున్నాయి. రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు ఏ మాత్రం కలెక్షన్స్ తగ్గకుండా దూసుకెళ్తుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదన్నట్లు, ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేకున్నా చిన్న యాక్టర్స్‌తో మూవీ తీసి సంచలనం క్రియేట్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్. ఇక ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్ అయితే ‘కల్ట్ బొమ్మ’ అంటున్నారు. తాజాగా ఈ సినిమా కాపీ అంటూ ప్రచారం జరుగుతుంది. దీని మీద దర్శకుడు సాయి రాజేష్ స్పందించడం విశేషం.
మామూలుగా సోషల్ మీడియాలో వచ్చే వాటికి పెద్దగా స్పందించరు. గతంలో కూడా చాలా మంది ఈ సినిమా కథ నాదే.. కాపీ చేశారంటూ ముందుకొచ్చారు. కానీ దర్శకులు ఎవరూ కూడా స్పందించింది లేదు. కానీ బేబి సినిమా కాపీ అంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కి సాయి రాజేష్ స్పందించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బేబి కథ నాదే అంటూ.. దినేష్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నానని.. ఇది 2012లో రాయడం మొదలుపెట్టి 2018లో పూర్తి కథను సిద్ధం చేసినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. పలు ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలను కలిసి కథ కూడా చెప్పానని వెల్లడించారు. ఆ క్రమంలోనే కొందరికి కథ ఇచ్చానని అన్నారు. ఇప్పుడు తన స్టోరీతోనే తెలుగులో సినిమా తీశారంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌ను ఒక తమిళ క్రిటిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని సాయి రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. మీడియా సంస్థలకు ట్యాగ్ చేస్తూ.. దీనిపై న్యూస్ రాయాలంటూ తెలిపారు.
ఇక ఇలాంటి సంఘటనలు జరగడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. సినిమా హిట్ కాకపోతే ఎలాంటి ఆరోపణలు చేయరు, కానీ ఒకవేళ హిట్ కొడితే మాత్రం ఈ కథ నాదే అంటూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటిది జరిగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘బలగం’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ కథ నాదే అంటూ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్‌గా మారాయి. తాజాగా బేబి సినిమా కూడా నాదే అంటూ ఒక వ్యక్తి తెరపై రావడం.. దానికి భిన్నంగా దర్శకుడు సాయి రాజేష్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఈ మూవీని తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్లు ఇప్పటికే సాయి రాజేష్ తెలిపారు.
😔Finally my Script ( Triangle story) got stolen by Telugu movie name Baby. I got finished my script in 2012 based on my love story happened in my life. Final bound script got ready in the year 2018 . I tried a lot of producers from various industries, Now it came as a movie pic.twitter.com/gyShbS06Wj
— Dinesh Kumar (@DineshK86207984) July 28, 2023