ఆదివారం వచ్చిందంటే చాలు తెలుగు ప్రేక్షకులంతా టీవీలకే అతుక్కుపోతారు. అన్ని టీవీ ఛానళ్లలో అదిరిపోయే ఎంటర్టైన్ మెంట్ షోలు ప్రసారం అవుతుంటాయి. అలాంటి పాపులర్ ఎంటర్టైన్ మెంట్ షోలలో ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రతి ఆదివారం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో, స్పెషల్ గెస్ట్ లతో అలరించే ఈ షోకి సంబంధించి కొత్తగా ప్రోమో వదిలారు నిర్వాహకులు.
సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక లేటెస్ట్ ప్రోమోలో ఎప్పట్లాగే అందరు పర్ఫార్మర్స్ కనిపించారు. కానీ స్పెషల్ గెస్టులుగా అలనాటి అందాల తారలు, కమెడియన్స్ బాబు మోహన్, అన్నపూర్ణ, కృష్ణవేణి ఇలా 1980 – 90లలో కామెడీతో అదరగొట్టిన సీనియర్ స్టార్స్ అంతా దర్శనమిచ్చారు. అయితే.. ఈసారి ప్రోమో చాలా స్పెషల్ గా నిలవనుంది.
ఈసారి ప్రోమోలో బాబు మోహన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఎందుకంటే.. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ కి అదిరిపోయే పెర్ఫార్మన్స్ చేశాడు. కానీ చివరిలో అందరిని ఎమోషనల్ చేసేశాడు. ప్రోమో చివరిలో.. ఎమోషనల్ అయిన బాబు మోహన్ ఏదో బాధాకరమైన సంఘటన గుర్తొచ్చి.. ‘అప్పట్లోనే చనిపోవాలని అనుకున్నా’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చుట్టూ ఉన్నవారు కూడా ఆయన మాటలకూ ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం బాబు మోహన్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.