రిపబ్లిక్ మూవీ ఫంక్షన్లో ఇండస్ట్రీ తరుపున మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ఇండస్ట్రీ మద్దతు కూడా లేకుండా పోతుంది. వైసీపీ నేతలే కాదు ఇండస్ట్రీ వ్యక్తులు సైతం పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నటుడు పోసాని మురళి ప్రెస్ మీట్ పెట్టి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలకు, మాకు సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అంతే కాదు చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం గురించి బాధపడుతున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం పవన్ ఫై వైసీపీ నేతలు మాటల దాడి కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా సీనియర్ కమెడియన్, రాజకీయ నేత బాబూ మోహన్ , పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై కాస్త ఘాటుగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం సహకారం ఇండస్ట్రీకి చాలా అవసరం. ఏపీ ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఓ విషయం అడిగారు. ఆ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.. అది వారి వ్యక్తిగతం కాదు.. దాన్ని విమర్శించి అది చిన్నోళ్లకు ఉపయోగపడుతుంది.. పెద్దోళ్లకు ఉపయోగపడదు అంటూ పవన్ ఏదేదో మాట్లాడారు. పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు కదా.. ఆయన తేల్చుకోవాలి.. ఇండస్ట్రీ బాగుంటే మనందరం బాగుంటాం. ఒక్క విషయం అడుగుతున్నా.. ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ సైడా ? లేక ప్రకాశ్ రాజ్ సైడా ? అనేదే అర్ధం కాలేదు. కాబట్టి.. ముందుగా పవన్ కల్యాణ్ ఎవరి సైడ్ ఉండబోతున్నారో తేల్చుకోవాలి.
పవన్ వ్యవహరించిన తీరు సరైనది కాదు అంటూ బాబు మోహన్ చాలా క్లారిటీగా తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీపై ప్రభావం చూపించదా.. ఎవరైనా నీ సొమ్ము తిన్నాడా? నీ రెమ్యూనరేషన్ గుంజుకున్నాడా? నీ అవకాశాన్ని తీసుకున్నాడా? ఎందుకయ్యా నీకు అంత ఫ్రస్ట్రేషన్. ఓ అంటూ ఊగిపోవడం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. ఏదో నీ ఇల్లు గుంజుకొని ఇల్లు కాలబెట్టి.. నీ బ్యాంక్ బ్యాలన్స్ అంతా తీసుకున్నట్లు. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల పరిశ్రమ పరువే పోతుంది అని బాబూ మోహన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) ఎన్నికలలో మంచు విష్ణు ప్యానల్ తరపున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా బాబు మోహన్ పోటీ చేస్తున్నారు.