విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో విశ్వక్ ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ, క్రమంగా విశ్వక్ సేన్ కు సపోర్ట్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే అందరూ విశ్వక్ సేన్ కు మద్దతు పలుకుతున్నారు. విశ్వక్ ఫ్యాన్స్ అయితే అతనికి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రిటిక్ బాబు గోగినేని కూడా విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలిచాడు. వివాదం జరిగిన తర్వాత నుంచి అటు ఛానల్ ను, ఇటు సొసైటీని బాబు గోగినేని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి విష్ణుకి పలు ప్రశ్నలు సంధించాడు.
ఇదీ చదవండి: విశ్వక్ సేన్ కోసం కదిలిన సినీ ఇండస్ట్రీ! స్టార్ హీరోలు వరుస ట్వీట్స్!
‘ఛానల్ స్టూడియోలో విశ్వక్ సేన్ అంత అవమానం జరిగితే.. ఎందుకు మూవీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎందుకు నోరు మెదపడం లేదు? డీజే టిల్లుని యాంకర్ దేవీ నాగవల్లి మీరు ఉమెనైజరా? అని ప్రశ్నించినప్పుడు ఎందుకు మౌనం వహించారు? సినిమా వాళ్లను అమర్యాదగా ట్రీట్ చేసినా పర్లేదా?’ అంటూ బాబు గోగినేని మంచు విష్ణుకు ప్రశ్నలు సంధించారు. బాబూ గోగినేని అడిగిన ఈ ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇండస్ట్రీ నుంచి అయితే కొంత మంది విశ్వక్ సేన్ కు మద్దతుగా రావడం చూస్తున్నాం. అయితే బాబూ గోగినేని ప్రశ్నలకు మంచు విష్ణు ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాల్సి ఉంది. బాబూ గోగినేని అడిగిన ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.