గత కొద్దిరోజులుగా తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వదంతులపై ప్రముఖ నటుడు బబ్లూ పృధ్వీరాజ్ స్పందించారు. ఈ మేరకు తన ప్రియురాలు శీతల్‌తో మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృధ్వీరాజ్, శీతల్ తమ ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు! కొన్ని విషయాలపై సీరియస్‌గా స్పందించారు. బబ్లూ పృధ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘ ఇదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆమెను కలవటం, నా భార్యతో విడాకులు రావటం.. అప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్యా ఓ అండర్‌స్టాండింగ్ ఏర్పడింది.
అలాంటి టైంలో మా మధ్య ఉన్న రిలేషన్ గురించి వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ముసలివాడు.. యువతి అని అంటున్నారు. నాకేమో 100 ఏళ్లు ఉన్నట్లు.. ఆమెకు 16 ఏళ్లు ఉన్నట్లు. ‘ ఈ వయసులో మీ కూతురు వయసున్న పిల్లతో పెళ్లా.. సిగ్గుగా లేదా’ అని ట్రోల్స్ చేస్తున్నారు. శీతల్ సడెన్‌గా నా జీవితంలోకి వచ్చింది. ఇంట్లో ఆరేళ్లుగా వివాదాలు నడుస్తున్న టైం అది. అప్పుడు నేను నా మనసులో భావాలను పంచుకోవటానికి ఎవరూ లేరని బాధపడుతున్నాను. ఆ టైంలో తను నా జీవితంలోకి వచ్చింది’’ అని తెలిపారు.
శీతల్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆంధ్రా యువతిని. మలేషియా యువతిని కాదు. ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను. మేము మొదటిసారి బెంగళూరులో కలిశాం. అది కూడా ఓ రెస్టారెంట్‌లో కలిశాం. అదంతా అత్యంత సాధారణంగా జరిగింది. అప్పుడు నేను ఓ ఐటీ కంపెనీలో పని చేసే దాన్ని. ఆయనను నేను మొదట గుర్తుపట్టలేదు. మా చిన్న తనంలో సీడీలు ఉండేవి. తెలుగులో ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా ఉంది. నేను ఆయన్ని తధేకంగా చూశాను. అప్పుడు సినిమాలోని ఆయన షర్టు గుర్తుకు వచ్చింది. అలా ఆయనను గుర్తుపట్టాను. నేను, నా ఫ్రెండ్ సెల్ఫీ తీసుకోవటానికి ఆయన దగ్గరకు వెళ్లాం. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం అయింది. నెంబర్లు కూడా మార్చుకున్నాం. ఆ తర్వాత మా మధ్య స్నేహం ప్రేమగా మారింది’’ అని చెప్పుకొచ్చింది.