గాన కోకిల, భారత రత్న లతా మంగేష్కర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆ మధుర గానం మూగబోవడంతో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశంలోని రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు లతా దీదీ మృతికి సంతాపం తెలిపారు. అలాగే పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్ కూడా లతా మంగేష్కర్ మృతికి తన సంతాపం తెలిపారు. ఒక స్వర్ణయుగం ముగిసిందని, ఆ మధుర గానం మన అందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. కాగా కరోనా సోకడంతో ముంబైలోని ఆస్పత్రిలో చేరిన లతా.. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.
End of a golden era. Her magical voice and legacy will continue to live in the hearts of millions worldwide. An unparalleled icon!
RIP Smt. Lata Mangeshkar Ji. pic.twitter.com/sOmhJtPT1I
— Babar Azam (@babarazam258) February 6, 2022