ప్రముఖ స్టార్ హీరో, సింగర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి కన్నుమూశారు. హీరో తండ్రి మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. దీని గురించి పూర్తి వివరాలు..
భారతీయ సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ అసామాన్య ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినీ తారలు చనిపోతుండటంతో ఆడియెన్స్ శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు వీరేంద్ర ఖురానా అలియాస్ పి.ఖురానా శుక్రవారం పొద్దున కన్నుమూశారు. గుండె సంబంధింత కారణాలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్ పొందుతున్న పి.ఖురానా.. కోలుకోలేక శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
పి.ఖురానా అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మణిమజ్ర శ్మశాన వాటికలో జరగనున్నాయి. ఆయన మృతిపై హిందీ చిత్రసీమకు చెందిన ప్రముఖులు, ఆయుష్మాన్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, బాలీవుడ్ యంగ్ హీరోల్లో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా ఆయుష్మాన్ పేరు సంపాదించారు. ‘విక్కీ డోనర్’ మూవీతో తెరంగేట్రం చేసిన ఆయన.. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో మెప్పించారు. ‘అంధాధున్’లో ఆయుష్మాన్ అద్భుతమైన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. పంజాబ్ యూనివర్సిటీలో ఆయుష్మాన్ ఖురానాకు సత్కారం ఉన్న సమయంలో తండ్రి మృతితో ఆయన విషాదంలో మునిగిపోయారు.
Ayushmann Khurrana’s Father And Popular Astrologer Pandit P Khurrana Dies Due To Heart Problems.https://t.co/A6YTBNA9Rl
— TIMES NOW (@TimesNow) May 19, 2023