సినీ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవ ఉండదు. ఇక ఓ జంట కొన్నాళ్ల పాటు క్లోజ్ గా మూవ్ అయితే వాళ్ళ మధ్య లేనిపోని గాచిప్స్ పుట్టించేస్తారు సినీ జనం. స్టార్ హీరోయిన్ అవికా గోర్ కి ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. హీరోయిన్ కాకముందే చిన్నారి పెళ్లి కూతురుగా అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం. ఆ తరువాత కూడా ఈమె హిందీలో చాలా సీరియల్స్ నటించింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో అవికా ఇక్కడ హీరోయిన్ వరుస అవకాశాలను అందుకుంది. కానీ.., సక్సెస్ ట్రాక్ తప్పడంతో ఈ అమ్మడు మళ్ళీ హిందీ బుల్లితెరపై బిజీ అయ్యింది.
నటుడు మనీశ్ రాయ్‌సింఘన్ మాత్రం అవికాకి అన్ని వేళల తోడుగా ఉంటూ వచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో చేసిన ‘ససురాల్ సిమర్ కా’ అనే సీరియల్‌లో వీరిద్దరూ కలసి నటించారు. అప్పటి నుండే వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ బాలీవుడ్ మీడియా కథనాలను అందిస్తూ వచ్చింది. ఈ వార్తలపై అవికా గోర్ ఎప్పుడూ స్పందించింది లేదు. కానీ.., ఇప్పుడు వీళ్లు సీక్రెట్‌గా ఓ బిడ్డను కూడా కన్నారని గుసగుసలు మొదలవ్వడంతో మొదటిసారి అవికా గోర్ ఈ విషయంలో స్పందించింది.
మనం మాట్లాడుకునే మాటల్లో కొంచెమైనా నిజం ఉండాలి. 13 ఏళ్ల వయసులో నటిగా నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుండి మనీశ్ నాకు స్నేహితుడు. అతడికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. అతడి నుంచి చాలా నేర్చుకున్నాను. మా మధ్య ఏదైనా జరిగిందేమోనని చాలా మంది చాలా రకాల వార్తలు పుట్టించారు. ఇప్పుడు ఏకంగా ఓ బిడ్డను కన్నాము అంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మనీశ్ ది మా నాన్న వయసు. అతనితో నేను ఎలా బిడ్డను కంటాను? ఇలాంటి వార్తలకి భయపడే మధ్యలో కొన్ని వారాలు మేము మాట్లాడుకోవడం మానేశాము. అయినా.., ఆ పుకార్లకి చెక్ పడలేదు. దీంతో.., ఇక మేము దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా పుకార్లని ఆపలేమని అర్ధమయ్యింది. ఇందుకే మేము ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండగలుగుతున్నాము. మాపై పుట్టుకొచ్చే ఇలాటి గాలి వార్తలను చూసి సరదాగా నవ్వుకుంటున్నాం అని అవికా గోర్ చెప్పుకొచ్చింది.