బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీని తర్వాత నెపోటిజం అనే పదం బాగా వాడుకలోకి వచ్చి.. ట్రెండింగ్ అయ్యింది. హిందీ చిత్ర పరిశ్రమ.. అగ్రతారలు, వారి నుండి నటవారసత్వాన్ని తీసుకున్న పిల్లల చేతుల్లోనే ఉందంటూ నటి కంగనా రనౌత్, కొంత మంది నటులు ఆరోపణలు కూడా చేసుకొచ్చారు. ఇప్పుడు..
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీని తర్వాత నెపోటిజం అనే పదం బాగా వాడుకలోకి వచ్చి.. ట్రెండింగ్ అయ్యింది. హిందీ చిత్ర పరిశ్రమ.. అగ్రతారలు, వారి నుండి నటవారసత్వాన్ని తీసుకున్న పిల్లల చేతుల్లోనే ఉందంటూ నటి కంగనా రనౌత్, కొంత మంది నటులు ఆరోపణలు కూడా చేసుకొచ్చారు. ముఖ్యంగా అగ్ర నిర్మాత కరణ్ జోహార్, అలియా భట్ వంటి వారిపై తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ దక్షిణాది సినీ పరిశ్రమపై ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రను ఉద్దేశించి ఇలాంటి ఆరోపణలే చేసింది. అయితే ఆమె తెలుగు సినిమాల ద్వారానే హీరోయిన్ గా పరిచయం కావడం విశేషం.
సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేసి, డబ్బు సంపాదించుకుని, మంచి పేరు తెచ్చుకున్న నటీమణులు.. బాలీవుడ్‌కి వెళ్లాక ఈ పరిశ్రమపై బురద చల్లడం మొదలు పెట్టారు. టాలీవుడ్‌లో హీరోల డామినేషన్ ఎక్కువ అంటూ రాధికా ఆప్టే. అక్కడ తనకు సంతృప్తి కరమైన పాత్రలు అక్కడ దొరకలేదంటూ తాప్సీ వంటి నటులు ఆరోపణలు చేశారు. తాజాగా ఈ జాబితాలోకి వచ్చింది మన చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికాగోర్. బాలికా వధు సీరియల్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు. తెలుగులో కూడా దీన్ని డబ్ చేసి.. చిన్నారి పెళ్లికూతురుగా తీసుకువచ్చారు. ఈ సీరియల్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది అవికా గోర్. అన్ని భాషల్లో విడుదలై మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్లిన సీరియల్ ఇది.
తెలుగులో ఆమెకు విపరీతమైన ఫ్యాన్స్ పెరిగిపోయారు. దీంతో ఆమెను తెలుగు తెరపైకి తీసుకువచ్చారు. ఉయ్యాల జంపాల ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా, తను నేను మావ వంటి చిత్రాల్లో చేసింది. అయితే ఆమె ఖాతాలో హిట్ అని చెప్పుకుంటే.. ఎక్కడికి పోతావు చిన్నవాడా. అందులో తనది చిన్న పాత్రే అయినా.. కీ రోల్ ఆమెదే. రాజుగాది గది 3, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో కనిపించింది. గత ఏడాది థ్యాంక్స్, పాప్ కార్న్ వంటి చిత్రాల్లో మెరిసింది. వీటితో పాటు హిందీలో సీరియల్స్, సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంది. బాలీవుడ్‌లో 1920 : హార్రర్ ఆఫ్ ద హార్ట్ సినిమాలో నటించింది అవికా గోర్. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్లలో పాల్లొంటుంది.
ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా.. దక్షిణాది సినిమాలపై ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘తెలుగులో దక్షిణాదిలో స్టార్స్ మీదే సినిమాలు నడుస్తాయి. నెపోటిజం అనే పదం విని విని అలసిపోయాను. సౌత్‌లో ఇది చాలా ఎక్కువ. కానీ ఇక్కడి ప్రేక్షకులు చూస్తున్నట్టు అక్కడి వాళ్ళు చూడరు. ఇటీవల బాలీవుడ్, హిందీ సినిమాలపై తీవ్ర వివక్షత వచ్చేలా చేశారు. సౌత్ సినిమాలు చాలా రీమేక్ చేస్తూ బాలీవుడ్ వాళ్ళు సౌత్ సినిమాలను కాపీ కొడతారు అనే స్థాయికి తీసుకొచ్చారు. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో నెపోటిజం చాలా ఎక్కువే ఉంది. ప్రజలు కూడా దీన్ని బాగా హైప్ చేశారు. తర్వాత ఇది తగ్గుతుంది అనుకుంటున్నా’ అని తెలిపింది. తెలుగు సినిమాలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు.