12 ఏళ్ళ కిందట విడుదలై సంచలనం సృష్టించిన మూవీ అవతార్. గ్రాఫిక్స్, విజువల్ వండర్ తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అయితే దీనిని తలదన్నేలా ఇప్పుడు అవతార్-2 మూవీ రానున్న సంగతి తెలిసిందే. యాక్షన్, గ్రాఫిక్స్, విజువల్ వండర్ ను చూపించే అవతార్ 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఎలా ఉంటాయనేది చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇటీవలే ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుండడం విశేషం. ఇక విషయం ఏంటంటే? ఈ మూవీ ట్రైలర్ తాజాగా లీక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: అవతార్ 2.. ఫస్ట్ లుక్ ఫోటోస్ వైరల్!
విజువల్ వండర్ ని తలపిస్తున్న ఈ ట్రైలర్ ను చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. ఈ మూవీని అవతార్ ని మించిన స్థాయిలో ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో 2022 డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. అయితే తాజాగా లీక్ అయిన అవతార్-2 ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#AvatarTheWayOfWater Official Trailer Leak! pic.twitter.com/RsZD6HkSWT
— K I N G (@KingKalyanPK) May 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.