తెలుగు వాళ్లకు, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. భాషతో సంబంధం లేకపోయినా సరే సినిమా నచ్చిందంటే చాలు అక్కున చేర్చుకుంటారు. అందులో హీరోహీరోయిన్ ఇంతకు ముందే తెలుసా? లేదా అనే విషయం అస్సలు పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో అలా హిట్టయిన సినిమా ‘కాంతార’. కేవలం కన్నడకే పరిమితమైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒరిజినల్ కంటే మన దగ్గర సూపర్ హిట్టయింది. రెగ్యులర్ చిత్రాలకు ధీటుగా వసూళ్లు సాధించింది. రూ.50 కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానే ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. డిసెంబరు 16న వేలకొద్ది థియేటర్లలో రిలీజ్ కానుంది. అప్పుడెప్పుడో 2009లో తొలి పార్ట్ విడుదలవగా, సీక్వెల్ రావడానికి ఇన్నేళ్లు పడుతోంది. ఇక సినిమా రిజల్ట్ మీద ఎవరికీ డౌట్ లేదు. ఎందుకంటే ఇది విజువల్ వండర్ క్రియేట్ చేయడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ సాధించడం గ్యారంటీ. కానీ ఓ విషయంలో మాత్రం ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సినిమాకు వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో పడిపోతున్నారు. దానికి కారణం ‘అవతార్ 2’ టికెట్ ధరలు.
ఎందుకంటే హాలీవుడ్ లో వేలకోట్లు పెట్టే సినిమా తీస్తున్నారంటే అందుకు తగ్గట్లే గ్రాండ్ విజువల్స్ ఉంటాయి. చూసే ఆడియెన్స్ ని కూడా ఫుల్ సాటిస్పై చేస్తాయి. ఇలాంటి సినిమాల్ని త్రీడీ, ఐమాక్స్ స్క్రీన్స్ పై చూస్తేనే అసలు మజా ఉంటుంది. కానీ టికెట్ రేట్స్ మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటాయి. త్వరలో రిలీజ్ కాబోయే ‘అవతార్ 2’ టికెట్ రేట్స్ చూసి కూడా ప్రేక్షకులు గజగజ వణికిపోతున్నారు. ఇక హైదరాబాద్ లో త్రీడీ టికెట్ రూ.350 ఉండగా, బెంగళూరులో మాత్రం ఏకంగా రూ.1450గా నిర్ణయించారు. ముంబయిలో రూ.970, పుణెలో రూ.1200, దిల్లీలో రూ.1000, కోల్ కతాలో రూ.770, అహ్మదాబాద్ లో రూ.750, వైజాగ్ లో రూ.210, చంఢీగడ్ లో రూ.450, ఇండోర్ లో రూ.700గా టికెట్ రేట్స్ ఫిక్స్ చేశారు. వీటిని చూసిన పలువురు నెటిజన్స్.. ‘అవతార్ 2 చాలా కాస్ట్ లీ గురూ’ అని మాట్లాడుకుంటున్నారు.