ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా.. కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సినిమా ‘అవతార్ 2‘. టైటానిక్, అవతార్ సినిమాలతో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ దక్కించుకున్న జేమ్స్ కామెరూన్.. 2009లో అవతార్ మూవీతో విజువల్ వండర్ క్రియేట్ చేశారు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత అదే అవతార్ మూవీకి సీక్వెల్ ని సిద్ధం చేశాడు. డిసెంబర్ 16న సుమారు 160 భాషలలో అవతార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అవతార్ 2కి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల మైండ్ లో భారీ అంచనాలు నెలకొల్పాడు. కేవలం టీజర్ లోనే మతిపోయే విజువల్స్ చూపించిన జేమ్స్ కామెరూన్.. తాజాగా అవతార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశాడు.
ఊహకు కూడా అందని జేమ్స్ కామెరూన్ విజువలైజేషన్.. ‘ది వే ఆఫ్ వాటర్’ అనే థీమ్ తో వస్తోంది.. కాబట్టి, దాదాపు అంచనాలకు మించిన గ్రాఫిక్స్ తో అవతార్ 2 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే విజువల్ వండర్ గా పేరున్న ఈ సినిమాను జేమ్స్ కామెరూన్ మరింత అద్భుతంగా మలిచాడు. ప్లీజెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే.. ది వే ఆఫ్ వాటర్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి.. అందుకు అనుగుణంగానే సినిమా కథ మొత్తం సముద్రంలో జరుగుతుందని అర్థమవుతుంది. ఈసారి పండోరా రాజ్యం జనాలు సముద్రాన్ని నమ్ముకొని.. అక్కడే వారి పవిత్ర వృక్షాన్ని పూజించడం మనం ట్రైలర్ లో చూడవచ్చు.
ఈ క్రమంలో జేక్, నేయిత్రిల జంటకు కొడుకు, కూతురు ఉండటం విశేషం. కానీ.. కళ్ళు చెదిరే అద్భుతాలు, సాహసాలకు మాత్రం అవతార్ 2లో ఏమాత్రం కొదవే లేదు. దాదాపు 3 గంటల 10 నిమిషాల నిడివి ఉందని తెలిసింది. కనుక అవతార్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. 67 ఏళ్ళ వయసులో జేమ్స్ ఈ సీక్వెల్ మూవీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. లైఫ్ లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ గా అవతార్ ని మలిచాడు జేమ్స్. ఆ విషయంలో గొప్ప స్టోరీ టెల్లర్ గా జేమ్స్ కామెరూన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఇక 20థ్ సెంచరీ ఫాక్స్ స్టూడియోస్, లైట్ స్టార్మ్ ఎంటర్టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ విజువల్ వండర్ ని.. సైమన్ ఫ్రాంగ్లేన్ తన అత్యద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేసిన విధానం కళ్లప్పగించేలా చేస్తోంది. జేమ్స్ కామెరూన్ కథాకథనాలు.. ప్రధాన నటీనటుల యాక్షన్ సీక్వెన్సులు.. అన్ని కలగలిపి అవతార్ 2 మూవీని విజువల్ ఫీస్ట్ గా తీర్చిదిద్దారని చెప్పవచ్చు. ట్రైలర్ మాత్రం సినిమాటోగ్రాఫర్ రస్సెల్ కార్పెంటర్ ఇంపాక్ట్ కలిగించేలా ఉంది. దాదాపు 25 కోట్ల డాలర్స్ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా.. డిసెంబర్ 16న థియేటర్స్ లో ఎలాంటి అద్భుతాలు సృస్టించనుందో చూడాలి!