ప్రపంచ సినీ చరిత్రలో ‘అవతార్’ సినిమా క్రేజ్ వేరు. 2009లో విడుదలైన అవతార్ సినిమాతో సినీ ప్రేక్షకులకు మరో అద్బుత ప్రపంచాన్ని పరిచయం చేశాడు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్. అవతార్ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో అవతార్ ముందే ఉంటుంది. ఇప్పుడు అదే స్థాయిలో ప్రేక్షకులను మరోసారి అవతార్ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు జేమ్స్ కామెరాన్.
దాదాపు అవతార్ విడుదలైన 12 ఏళ్ళ తర్వాత.. అవతార్ 2 రిలీజ్ కాబోతుంది. ఇటీవలే అవతార్ 2 టైటిల్ కూడా అనౌన్స్ చేసింది చిత్రబృందం. ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ అనే టైటిల్ తో సినిమా ప్రపంచవ్యాప్తంగా 2022 డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులోనూ అవతార్ 2.. వరల్డ్ వైడ్ 160 భాషల్లో రిలీజ్ అవుతుండటం విశేషం. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Jake Sully is coming! First look at ‘Avatar 2’ pic.twitter.com/Ys7tqi9C2R
— Mohan Raj (@MohanRa26189759) April 30, 2022
ఇక 3డీ, 4డీఎక్స్, ఐమాక్స్, డాల్బీ విజన్, పీఎల్ఎఫ్ తోపాటు ఇతర ఫార్మాట్లలో అవతార్ 2 సందడి చేయబోతుంది. ఇక ప్రస్తుతం అవతార్ 2 ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడెప్పుడు అవతార్ 2 ఫస్ట్ లుక్ గ్లింప్స్ వస్తుందా అని వెయిట్ చేస్తుండగా.. తాజాగా అవతార్ 2 ఫస్ట్ లుక్ పిక్స్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవతార్ 2లోని అద్భుతమైన దృశ్యాలుగా ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. కానీ వైరల్ అవుతున్న పిక్స్ ఫ్యాన్ మేడ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అవతార్ 2 ఫస్ట్ లుక్ పై క్లారిటీ రావాలంటే గ్లింప్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మరి అవతార్ 2 మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.