హీరోగా లాంచ్ అవుతున్నట్లు తెలిపేందుకు ఒక ప్రెస్‌మీట్ పెట్టుకుని.. అందులో తన హావాభావాలతో ట్రోలింగ్‌కు గురైన చంద్రహాస్.. తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కలిశాడు. ప్రముఖ బుల్లి నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమారుడైన చంద్రహాస్‌ను సోషల్ మీడియాలో యాటిట్యూడ్ స్టార్‌గా నెటిజన్లు పిలుస్తున్నారు. రెండో సినిమాల్లో హీరోగా చేస్తున్నాడని, తనని ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ప్రభాకర్ ఒక ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసిందే. అందులో చంద్రహాస్ నిలబడిన తీరు, అతని హావాభావాలుపై నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు. ఇక మీమర్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. కొన్ని రోజులుగా యాటిట్యూడ్ స్టార్‌గా చంద్రహాస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
తన కొడుకుపై జరుగుతున్న ట్రోలింగ్‌కు తండ్రి ప్రభాకర్ సానుకూలం స్పదించారు. మంచిగానో చెడుగానో తన కుమారుడు చంద్రహాస్ జనంలోకి వెళ్లాడాని అందుకు ట్రోల్స్, మీమ్స్ కారణమైనా తమకు సంతోషమే అని వెల్లడించి షాక్ ఇచ్చారు. అలాగే సినిమాల్లోకి రాకముందు.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు కవర్ సాంగ్ చేసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ సాంగ్ అప్పుడు పెద్దగా ఎవరీకి తెలియకపోయిగా.. చంద్రహాస్‌పై ట్రోలింగ్ జరిగిన తర్వాత ఆ పాట్‌కు మిలియన్లలో వ్వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో చంద్రహాస్ మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతిని వెళ్లి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అతనితో పాటు ప్రభాకర్ కూడా ఉన్నాడు. తన సినిమా టీజరో, లేక నాటునాటు కవర్ సాంగ్‌నో విజయ్ సేతుపతికి చూపించినట్లు తెలుస్తుంది. కాగా.. చంద్రహాస్‌ను విజయ్ అభినందించి, ఆల్‌ది బెస్ట్ చెప్పినట్లు సమాచారం.