'అతిథి' మూవీ మీలో ఎంతమంది చూశారు? అందులో హీరోయిన్ చెల్లిగా చేసిన పాప గుర్తుందా? ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూస్తే షాకవుతారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే మూవీ ‘పోకిరి’. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా తర్వాత మహేష్ వరసగా ఫ్లాప్స్ అందుకున్నాడు. వాటిలో ‘అతిథి’ ఒకటి. సురేందర్ రెడ్డి తీసిన ఈ చిత్రంలో మహేష్ సరికొత్తగా కనిపించాడు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలంటే మినిమం ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఇందులో అలాంటిదేం ఉండదు. ఆల్మోస్ట్ చాలా సీరియస్ గా సాగుతూ ఉంటుంది. ఇందులో హీరోయిన్ కు చెల్లెలిగా నటించిన ఓ పాప.. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది.
అసలు విషయానికొస్తే.. మహేష్ బాబులోని మరో యాంగిల్ ని బయటకు తీసిన మూవీ అంటే ‘అతిథి’నే. యాక్టింగ్ పరంగా బాగానే చేసినప్పటికీ.. ఫ్యాన్స్ అంచనాల్ని అందుకోవడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. దీంతో ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. ఓపెనింగ్ కలెక్షన్స్ మినహా పెద్దగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఇందులో హీరోయిన్ చెల్లిలుగా చేసిన పాప.. తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో ఫిదా చేసింది. కానీ క్లైమాక్స్ లో ఆ పాప చనిపోవడం చాలామందికి నచ్చలేదు. హీరో కాపాడి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అనుకున్నారు.
‘అతిథి’లో నటించిన ఆ పాప పేరు కర్మన్ సంధు. ఈ మూవీ తర్వాత మరే సినిమాల్లో నటించలేదు. స్టడీస్ పై పూర్తిగా కాన్సట్రేషన్ పెట్టిన ఈమె.. ప్రస్తుతం హైదరాబాద్ లోనే సైకాలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలా అప్పటి, ఇప్పటి ఫొటోలను కంపేర్ చేసి చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. పాప చాలా మారిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ‘అతిథి’లో ఆ పాప యాక్టింగ్ మీలో ఎంతమందికి ఇష్టం? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.