తెలుగు సినిమాలకు నంది అవార్డుల రూపంలో ప్రభుత్వం అవార్డులు ఇచ్చేది. అప్పట్లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు. ఆ అవార్డులు వచ్చినప్పుడు నటీనటులు కూడా గౌరవంగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక అవార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. దీనిపై ప్రముఖ నిర్మాతు స్పందించారు.
సినిమా రంగంలో నటీనటులకు గుర్తింపు నిచ్చేవి అవార్డులు. సినిమా హిట్ కొట్టినప్పుడు దక్కిన ఆనందం కన్నా, ఏదైనా అవార్డు వచ్చినప్పుడు తమ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుందని భావిస్తారు. అందుకే ఇటీవల తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్‌లోని ఓ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే దేశమంతా సంబరపడిపోయింది. తమకే ఆ అవార్డు వచ్చినంత ఆనందంలో మునిగిపోయింది. అయితే గతంలో తెలుగు సినిమాలకు నంది అవార్డుల రూపంలో ప్రభుత్వం అవార్డులు ఇచ్చేది. అప్పట్లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు. ఆ అవార్డులు వచ్చినప్పుడు నటీనటులు కూడా గౌరవంగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక అవార్డులపై శ్రద్ధ పెట్టడం లేదు. దీనిపై తాజాగా పలువురు నిర్మాతలు మండిపడ్డారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను ఈ మే 31న మళ్ళీ విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం ఈ చిత్ర నిర్మాత, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరి రావు మీడియా సమావేశం నిర్వహించారు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నంది అవార్డలుపై మీడియా అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులపై అప్రస్తుతం అయిపోందని శేషగిరి రావు అన్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నంది అవార్డులపై ఎటువంటి ఆసక్తి లేదన్నారు.
గతంలో ప్రభుత్వం అవార్డుకు ఓ వాల్యూ ఉండేదని, తన ఉద్దేశంలో ఈ అవార్డులకు అంత ప్రాధాన్యత లేకుండా పోయందని చెప్పారు.‘ ప్రస్తుతం నడుస్తున సీజన్ వేరు కదా.. ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండ వాళ్లకు ఇస్తారు అవార్డులు. రెండు మూడేళ్లలో ఘనంగా అవార్డులు ఇచ్చే రోజులు వస్తాయి. అప్పుడు మనందరికీ అవార్డులు వస్తాయి’అని ఏపీలోని జగన్ సర్కార్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు అశ్వనీదత్ . పాన్ ఇండియా సినిమాలంటుంటే సిగ్గు పడాల్సి వస్తుందన్నారు. విఠలాచార్య వంటి వారు ఎప్పుడో అటువంటి సినిమాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, బి గోపాల్, తదితరులు పాల్గొన్నారు.