సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలను చెప్పే ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వేణు స్వామి ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఎందుకంటే.. వీరిద్దరు విడిపోతారని ఆయన ముందే చెప్పాడు. ఇక అప్పటి నుంచి వేణు స్వామి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నయనతార-విఘ్నేష్ శివన్‌ల వివాహం సందర్భంగా కూడా వేణు స్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు నయనతారకు వివాహమే అచ్చిరాదని.. భవిష్యత్తులో విడాకులు తప్పవని కామెంట్ చేశాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నరేష్ విడాకుల గురించి.. ఆయన కుటుంబంలో చోటు చేసుకోబోయే పరిణామాల గురించి తాను ముందే చెప్పానని వెల్లడించి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలు..
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతితో విడాకుల వ్యవహారం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. కర్ణాటకలో కూడా విపరీతంగా వైరలయ్యింది. మూడో భార్యతో విభేదాలు, పవిత్రా లోకేష్‌తో డేటింగ్ వంటి వార్తలు కొన్ని రోజులు మీడియాలో ప్రముఖంగా నిలిచాయి. ఈ క్రమంలో నరేష్ విడాకులు, విజయ నిర్మల మరణం గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఆయన విడాకులు, విజయ నిర్మల మృతి గురించి తాను ముందే చెప్పానన్నాడు వేణు స్వామి.
నరేష్, రమ్య రఘపతిపెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు వేణు స్వామి మాట్లాడుతూ ‘‘కృష్ణగారు నా ఫేవరేట్ హీరో. నేను ఏ స్థాయికి వచ్చినప్పటికీ కృష్ణగారింట్లో పూజలు చేయటం మానలేదు. నేను రెగ్యులర్‌గా వారింట్లో పూజలు చేస్తున్న సందర్భంలో జాతకాలు కూడా చెప్పేవాడిని. 2014 సమయంలో అనుకుంటాను.. కృష్ణ, విజయ నిర్మలగారి జాతకాలు చూసి, 2020లో మీ ఇద్దరిలో ఒకరు చనిపోతారని చెప్పాను. ఆ మాటలు విన్న విజయ నిర్మలగారు భయపడ్డారు. అంటే భయపెట్టడమనేది నా ఉద్దేశం కాదు. ఉన్న విషయాన్ని చెప్పాను. దానికి పరిహారం చేసుకుంటే బావుంటుందని చెప్పాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘ఆ సమయంలో నరేష్‌గారు కూడా అక్కడే ఉన్నారు. ఎందుకలా చెప్పారని ఆయన అడిగారు. నాకు ఇష్టమైన వ్యక్తులు బావుండాలని ఉద్దేశంతోనే చెప్పినట్లు అన్నాను. అదే ఏడాదిలోనే నరేష్, రమ్య రఘపతిగారి పెళ్లి జరిగింది. అప్పుడు కూడా నేను వారి జాతకాలు చూశాను. అవి కలవలేదు. జాతకాలు కలవటం లేదు కాబట్టి, పెళ్లి అయినా విడాకులు అవుతాయని చెప్పాను. అందుకనే నేను వారి పెళ్లి నా చేతుల మీదుగా చేయలేదు. కానీ వారి ఇంట్లో జరిగిన వ్రతాన్ని నేను నిర్వహించాను. ముహుర్తం పెట్టే సమయంలోనూ నేను చెప్పినా వినలేదు. వాళ్లు జాతకాలు మార్చి పెళ్లి చేసుకున్నారని భావిస్తున్నాను. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. కానీ జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే కలిసి ఉండలేరనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పడానికి చెప్పాల్సి వచ్చింది’’ అన్నాడు.
‘‘అంతేకాక 2020లో కృష్ణ, విజయ నిర్మల.. ఇద్దరిలో ఒకరు చనిపోతారని ఎప్పుడైతే ఓపెన్‌గా చెప్పానో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు. నేను కూడా అప్పటి నుంచి వారింటికి వెళ్లటం మానేశాను. నిజానికి నేను ఆ సమయంలో నేను చెప్పిన రెండు విషయాలు నిజమయ్యాయి’’ అని వేణు స్వామి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.