వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల భవిష్యత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. సెలబ్రిటీలతో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక తాజాగా మరో హీరోయిన్ ఇంట్లో కూడా పూజలు చేశారు. ఆ వివారాలు..
వేణు స్వామి.. ఈ జ్యోతిష్యుడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల భవిష్యత్తుకు సంబంధించి కామెంట్స్ చేయడం.. వారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయడంతో.. నిత్యం వార్తల్లో నిలిస్తుంటాడు. ఇక అక్కినేని నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత మరింత ఫేమస్ అయ్యాడు. వారిద్దరూ విడిపోతారంటూ.. వారి పెళ్లికి ముందే వివాహ బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారి విడాకులు తర్వాత.. ఈ వీడియో వైరల్ కావడమే కాక.. వేణు స్వామి గురించి సామాన్యులకు కూడా తెలిసింది. ఆ తర్వాత.. పలువురు సెలబ్రిటీలకు సంబంధించి జాతకాలు చెబుతూ, వారి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే వివరిస్తూ యూట్యూబ్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించారు వేణుస్వామి. జాతకాలు మాత్రమే కాక.. సెలబ్రిటీల కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తాడు వేణుస్వామి. గతంలో రష్మిక మందన్న వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకొన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ జాబితాలో చేరారు.
ఇక తాజాగా వేణు స్వామి.. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం. నిధి అగర్వాల్ ఇంట్లో.. రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిధి అగర్వాల్‌తో వేణుస్వామి బృందం పూజ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రసుత్తం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నిధి అగర్వాల్.. పింక్ కలర్ చుడీదార్ ధరించి.. వేణుస్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు. నిధి అగర్వాల్ పక్కనే కూర్చొని వేణుస్వామి ఈ పూజ చేయించారు. ఇక గతంలో రష్మిక మందనతో కూడా వేణుస్వామి పూజ చేయించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం వేణుస్వామిపై సాధారణ ప్రజలకే కాకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు కూడా బాగా నమ్మకం పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. పలువురు సెలబ్రిటీలు తనను కలిసి జాతకాలు చెప్పించుకున్నట్లు.. ఆయన వెల్లడించాడు. అయితే ఈ వ్యాఖ్యలను కొట్టి పారేయడానికి లేదు. ఇప్పటికే రష్మిక మందన్న.. ఆయన దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకోగా.. తాజాగా నిధి అగర్వాల్ కూడా ఈ జాబితాలో చేరింది. మరి నిధి అగర్వాల్ ఈ పూజ ఎందుకు చేశారు.. కెరీర్ పరంగా బాగుండాలి అని పూజలు చేసిందా.. లేక ఆమె జాతకంలో ఏమైనా దోషముందా వంటి విషయాల గురించి తెలియరాలేదు.
అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి అగర్వాల్.. ‘మిస్టర్ మజ్ను’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలు వచ్చాయి. శింబు హీరోగా వచ్చిన ‘ఈశ్వరన్’, జయం రవి సరసన ‘భూమి’ సినిమాల్లో నిధి నటించారు. కిందటేడాది తెలుగులో ‘హీరో’, తమిళంలో ‘కలగ తళైవాన్’ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్.. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరిహర వీర మల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి అగర్వాల్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వేణుస్వామి వేణుస్వామి !
వేణుస్వామి చుట్టు తిరుగుతున్న హీరోయిన్లు
మొన్న #Rashmika ఈరోజు #NidhhiAgerwal , #VenuSwami తో పూజ చేయిస్తే చాన్సులు పెరుగుతాయి అని నమ్ముతున్న Young Heroines ?! pic.twitter.com/kctqcnv7q0
— Daily Culture (@DailyCultureYT) March 27, 2023