ప్రస్తుతం సమాజంలో జ్యోతిష్కులకు, బాబాలకు, ఆస్ట్రాలజి చెప్పే వారికి చాలా డిమాండ్ ఉంది. ఎవరైనా చెప్పింది చెప్పినట్టు జరిగితే ఆ వ్యక్తికి బాగా పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. అలాంటి ఓ వ్యక్తి పేరే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అతడే ప్రముఖ ఆస్ట్రాలజి నిపుణుడు.. వేణు స్వామి. తాజాగా అతడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే..
గత కొంతకాలంగా వేణు స్వామి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. దానికి కారణం గతంలో నాగచైతన్య సమంత పెళ్లి చేసుకుంటే విడిపోతారని ఈయన చెప్పారు. అయితే ఈయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య జంట విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఈయన సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన రష్మిక మందన్న బ్రేకప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి మాట్లాడుతూ..” తాను రష్మిక రక్షిత్ శెట్టి జాతకాలు పరీక్షించిన అనంతరం రక్షిత్ శెట్టి నుంచి విడిపోవడమే మంచిదని రష్మికకు సూచించినట్లు తెలిపారు. తన నుంచి విడిపోతేనే సినీ కెరీర్ బాగుంటుందని చెప్పడం వల్లే రష్మిక తన ఎంగేజ్మెంట్ కు బ్రేకప్ చెప్పుకుందని ఈయన వెల్లడించారు. అలాగే హైదరాబాదులో రష్మిక ఇంటిలో తాను కొన్ని పూజలు చేశానని చెప్పుకొచ్చారు. కన్నడ హీరో రక్షిత్ శెట్టి , రష్మికలు పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దపడ్డ సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గత కొద్ది రోజుల క్రితం రష్మిక పెళ్లి చేసుకున్నా.. వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటుందనీ, తన సినీ ప్రయాణం 2024 వరకు అద్భుతంగా కొనసాగుతుంది. అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రష్మిక పుష్ప2, సీతా రామం లాంటి వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. తాజాగా నెట్టింట వైరల్ గా మారిన వేణు స్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.