దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్నారు నయనతార. కమర్షియల్ హీరోయిన్‌గా నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతారే. ఒక్క సినిమాకు సుమారు 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందని సమాచారం. అంత మొత్తంలో పారితోషికం ఇవ్వడమే కాక ఆమె పెట్టే కండీషన్స్‌కి ఓకే చెప్పి మరీ.. నయన్ డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు నిర్మాతలు. ప్రస్తుతం నయన్ పెళ్లి గురించి జోరుగా చర్చించుకుంటున్నారు జనాలు. జూన్ 9న, తిరుమల శ్రీవారి సన్నిధిలో నయన తార.. తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నయన్ పెళ్లి వార్తల నేపథ్యంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: Nayanthara-Vignesh Shivan: పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేసుకున్న నయనతార- విఘ్నేష్ శివన్.. ఎప్పుడంటే!
ఇండస్ట్రీ సెలబ్రిటీల సినీ జీవితం, వైవాహిక జీవితంపై తనదైన కోణంలో స్పందించే ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఇప్పుడు నయన తార పెళ్లి, వైవాహిక జీవితం చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయన తారకు పెళ్లి అచ్చిరాదని తెలిపారు. నయన తార జాతకంలో గురువు నీచంలో ఉన్నాడని అందుకనే ఆమె వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో ఆయన మిగిలిన స్టార్ హీరోయిన్స్ అయిన అనుష్క శెట్టి, రష్మిక మందన్న పెళ్లిపై కూడా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. మరి వేణు స్వామి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nayanthara: నయనతార తిరుమలలోనే ఎందుకు పెళ్లి చేసుకోబోతుందంటే?