ఆసియా కప్ 2022 సందర్భంగా ఆదివారం దాయాదుల మధ్య మ్యాచ్ జరిగింది. భారీ అంచనాలు.. తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. ఇక మ్యాచ్ ప్రాంరభం అయ్యే ముందు సడెన్‌గా గ్రౌండ్‌లో ఎంట్రీ ఇచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న విజయ్‌కు మాత్రం దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పాడ్డారు. ఈ క్రమంలో విజయ్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు టీవీ స్క్రీన్ పై సందడి చేశారు. గ్రౌండ్‌లో విజయ్‌ని చూసిన అభిమానులు రౌడీ రౌడీ అంటూ అరుస్తూ సందడి చేశారు. ఇక పాకిస్తాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్, భారత మాజీ సీమర్ ఇర్ఫాన్ పఠాన్‌లతో కలిసి మ్యాచ్‌కు ముందు టీవీ వ్యాఖ్యాతతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠగానే ఉంటుంది. ఏ ఫార్మాట్ అయినా సరే.. దాయాదుల మధ్య జరిగే మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నాడు విజయ్. అందరిలానే తాను కూడా భారత్ మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నట్లు రౌడీ బాయ్ వివరించాడు. ఈ సందర్భంగా సినిమాలకు సంబంధించి విజయ్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురయ్యింది. ఏ భారత క్రికెటర్ బయోపిక్‌లో నటించాలని ఉంది అని అడిగిన ప్రశ్నకు రౌడీ హీరో ఇచ్చిన సమాధానం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ప్రశ్నకు విజయ్ బదులిస్తూ.. ధోని బయోపిక్‌లో నటించాలని ఉండే.. కానీ ఆల్రెడీ తీసేశారు. ఇక ప్రసుత్తం ఉన్నవారిలో విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉంది. అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని చెప్పుకొచ్చాడు. ప్రసుత్తం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.