చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి ఫెర్మామెన్స్‌తో ఆకట్టుకుంటారు కొంత మంది నటులు. అటువంటి వారిలో ఒకరు అశ్విన్ బాబు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడే ఈ అశ్విన్. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చిన అశ్విన్‌ను పరిచయమైంది అన్నయ్య సినిమాతోనే. జీనియస్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమ్యారు. రాజుగాది సిరీస్ చేశారు. ఇప్పుడు హిడింబ ద్వారా రాబోతున్నారు.
చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి ఫెర్మామెన్స్‌తో ఆకట్టుకుంటారు కొంత మంది నటులు. అటువంటి వారిలో ఒకరు అశ్విన్ బాబు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ తమ్ముడే ఈ అశ్విన్. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చిన అశ్విన్‌ను పరిచయమైంది అన్నయ్య సినిమాతోనే. జీనియస్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమ్యారు. ఆ తర్వాత జత కలిసే అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత రాజుగారి గదిలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్నారు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో ముగ్గురుతో కలిసి తెర పంచుకున్న అశ్విన్.. ఆ తర్వాత రాజుగారి సిరీస్‌లో నటించారు. రాజుగారి గది-3లో తనలోని హీరోయిజాన్ని వెలికి తీశారు. అయితే రాజుగాది సిరీస్ అన్నింటికీ కూడా అతడి అన్నయ్యే దర్శకుడు కావడం గమనార్హం. ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అయితే ఇతడి ఖాతాలో లేదు. అదీ కూడా అన్నయ్య పేరుతోనే పరిశ్రమలో నెట్టుకొస్తున్నారు.
ప్రస్తుతం హిడింబ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి మంచి హైప్ ను పెంచింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవిఘ్నేష్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించాడు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అయితే ఈ చిత్ర బృందం మాటీవీలో ప్రసారమయ్యే సిక్త్ సెన్స్ అనే గేమ్ షోకు వెళ్లారు. అశ్విన్, హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్, చిత్ర బృందం వచ్చారు. అయితే ఈ షోకు ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. ఈ షోకు వచ్చిన సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ… తొలిసారిగా తన తమ్ముడితో కలిసి సిక్త్ సెన్స్ ఆడుతున్నానని చెప్పారు ఓంకార్.
మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు కదా..ఏ స్ట్రగుల్ మీకొక లెసన్ నెర్పిందీ అని నందితాను ఓంకార్ ప్రశ్నించగా.. ఎమోషనల్ అయిపోయింది నందితా. ‘మానాన్న ఆసుపత్రిలో ఉన్నాను. నేను షూటింగ్ వెళ్లాలి. ఐదు ఆరు రోజులు ఉండను .. మీరు చూసుకుని తినండి అని చెప్పాను. అయిన నా చేతి పట్టుకుని, వెళ్లిపోతున్నావా.. నువ్వు లేకపోతే నాకు కాళ్లు, చేతులు ఆడవు అన్నారు’ అంటూ ఏడ్చేసింది. అదే తనకు, నాన్నకు జరిగిన చివరి మాటలు అని కన్నీటి పర్యంతమైంది. అలాగే తన తమ్ముడు అశ్విన్‌ను కూడా ఓ ప్రశ్న వేశాడు. ‘నీ లైఫ్ లో ఏదైనా బాధను నాకు చెప్పకుండా దాచావా‘ అని ప్రశ్నించగా.. దానికి అశ్విన్ బాగా బాధపడ్డాడు. నా స్ట్రగుల్స్ నీతో చెప్పుకోలేదు అన్నయ్యా అనేశాడు. ‘అలా దాచిపెట్టిన ఒక్క స్ట్రగుల్ చెప్పు’ అని అడిగారు ఓంకార్. ఆ మాటతో అశ్విన్ మరింత ఎమోషనల్ అయ్యారు
ఆ సమయంలో ‘నాన్న అయినా, అన్న అయినా అన్ని నేను నీకు, నాకు చెప్పడానికేంట్రా’ అని అడగ్గా.. అశ్విన్ కన్నీరు పెట్టుకున్నారు. ‘ఇప్పటి వరకూ నన్ను చూసుకుంటూనే ఉన్నావ్.. ఇంకా నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాను అన్నయ్యా.. నిన్ను అడగాలంటే కన్నీళ్లు ఆగడం లేదు’ అంటూ అశ్విన్ బాబు గట్టిగా ఏడ్చేశాడు. తమ్ముడ్ని చూసి అన్న కూడా ఎమోషనల్‌గా కనిపించారు. వాస్తవానికి ఓంకార్ మొత్తం ముగ్గురు అన్నదమ్ములు. తండ్రి పోయాక.. తమ్ముళ్లను సెటిల్ చేసేందుకు ఎంతో కృషి చేశారు. అనుకున్నట్లుగా పెద్ద తమ్ముడు అశ్విన్ ను హీరోను చేయగా.. చిన్న తమ్ముడు నిర్మాణ రంగం వైపు ఉన్నారు. వీరిని సెటిల్ చేసేందుకు ఒకానొక సందర్భలో తెల్లబట్టలే ధరించేవారు ఓంకార్. వీరి అనుబంధం గురించి తెలిసి కనుక ఈ వీడియోను చూస్తే నిజంగా కన్నీరు ఆగదు. అయితే ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో అన్నయ్య అయినా తండ్రిలా బాధ్యతగా మెలుగుతున్న ఓంకార్ ను చూసి ఎంతో మంది నెటిజన్లు మెచ్చకుంటున్నారు.