జూనియర్ సమంతగా ఫేమస్ అయిన అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా పాల్గొని ఇంకాస్త ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత బుల్లితెరపై అడపా దడపా షోలలో కనిపించి ఫ్యాన్స్ కాస్త కిక్కిచ్చేది. అలా షోలలో కనిపిస్తూనే తన హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియానే షేక్ చేస్తుండేది. ఇక మరీ ముఖ్యంగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని మరింత క్రేజ్ ను మూటగట్టుకుంది.
మరో విషయం ఏంటంటే? అషు రెడ్డి కమెడియన్ హరి, రాహుల్ సిప్లిగంజ్ లతో రిలేషన్ లలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తుంటాయి. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ కనిపిస్తూ తన హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ల మనసును దోచేస్తుంది అషు రెడ్డి. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో ముగిసిన బిగ్ బాస్ ఓటీటీలో సైతం అషు రెడ్డి పాల్గొని తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చివరికి వరకు ఉన్న అషు బేబీ లాస్ట్ మూమెంట్ లో ఉన్నట్టుండి బయటకు వచ్చేసి ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచింది.
ఇది కూడా చదవండి: Ram Prasad: కిరాక్ RP టాటూ పై.. హైపర్ ఆది, రామ్ ప్రసాద్ కామెంట్స్..!
ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్ యంగ్ ఆండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండతో వీడియో కాల్ మాట్లాడింది. అయితే దీనికి సంబంధించి ఈ బ్యూటీ విజయ్ తో మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ లో పెట్టుకుంది. ఇది చూసిన నెటిజన్స్ అంతా షాక్ కు గురయ్యారు. అయితే విజయ్ దేవరకొండతో అషు రెడ్డితో ఏం మాట్లాడింది? ఇద్దరి కలిసి ఎంత సేపు మాట్లాడుకున్నారనేది మాత్రం అషు రెడ్డి కాస్త సస్పెన్స్ లో పడేసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో అషు రెడ్డి వీడియో కాల్ పై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.