జూనియర్ సమంతగా బాగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర పై చాలా షోల్లో అషు మెరుస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మతో కలసి ఈ అమ్మడు చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. బుల్లితెరపై కూడా భారీగా అందాలను ఆరబోయడం ఆషు స్టయిల్. కానీ.., ఇంత కష్ట పడుతున్నా అషు మాత్రం ఆశించిన స్థాయిలో బ్రేక్ రావడం లేదు.
బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ చేసినా కూడా అషుని అంతా లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అషురెడ్డి ఎవరిపై ఆధారపడకుండా ఓ యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసుకుని, అందులో వీడియోస్ చేస్తూ తన టాలెంట్ చూపిస్తోంది. ఇందులో భాగంగానే తాను ప్రెగ్నెంట్ అయ్యాను అని, తన తల్లితో తాజాగా ఫ్రాంక్ వీడియో చేసింది అషురెడ్డి. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వడం ఏమిటి అని అషురెడ్డి తల్లి రెచ్చిపోవడం ఈ ఫ్రాంక్ వీడియోలో హైలెట్ గా నిలుస్తోంది. మరి.. అషురెడ్డి చేసిన ఈ ఫ్రాంక్ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.