అషు రెడ్డి.. జూనియర్ సమంతగా పిలవబడే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటుంది. ఇక ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లతో మత్తెక్కిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అయితే అషు రెడ్డి గతంలో బిగ్ బాస్ సీజన్-3లో కంటెస్టెంట్ గా రాణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ ఓటీటీ సైతం ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్ గా ఎంపికైంది అషు రెడ్డి. బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అషు రెడ్డి ఒకరు.
ఇది కూాడా చదవండి: కోటా శ్రీనివాసరావుకి మెగా ఫ్యాన్స్ కౌంటర్స్! రంగస్థలం చూడలేదా అంటూ..!
అషు రెడ్డి చివరి వరకు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అనుకున్నట్లు కాకుండా లాస్ట్ సండే సడెన్ షో నుంచి అషు రెడ్డి ఎలిమినేట్ అయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక విషయం ఏంటంటే? ఎలిమినేట్ అయిన తర్వాత అషు రెడ్డి స్టేజ్ మీదకు వచ్చింది. ఇక వచ్చిన వెంటనే ఆమె జర్నీ వీడియోను ప్లే చేశారు. అందులో అషు రెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకు ముద్దు పెడుతున్న విజువల్స్ చూపించడంతో అషు రెడ్డి నాగార్జునకు మరోసారి ముద్దు పెట్టింది. ఇక ఇదే ఫోటోను అషు రెడ్డి తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
పోస్ట్ చేస్తూ.. ”ఈ ఇంటిలో లిటిల్ గాళ్ ను నేను మిస్ అవుతానని నాగార్జున గారు చెప్పారు. బిగ్ బాస్ ప్రపంచంలో ఆయన ఎప్పుడూ మంచిగా ఉంటారు. మోటివేషన్ ఇస్తారు. అందరినీ గౌరవిస్తూ మంచి హోస్ట్ గా ఉన్నందుకు థాంక్స్. నా హృదయంలో మీది ఎప్పటికీ ప్రత్యేక స్థానమే అంటూ అషురెడ్డి రాసుకొచ్చింది. తాజాగా నాగార్జునకు ముద్దు పెడుతూ పెట్టిన ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. బోల్డ్ బ్యూటీ నాగార్జునకు ముద్దు పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.