ఇండస్ట్రీలో నటీ, నటులు తమ తమ షూటింగ్స్ ల్లో తెగ బిజీగా ఉంటారు. కాస్తో కూస్తో టైమ్ దొరికితే సోషల్ మీడియాలో దూరిపోయి అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. అక్కడ వారికి ఒక్కోసారి వింత వింత ప్రశ్నలు ఎదురౌతూ ఉంటాయి. కొందరు సెలబ్రిటీలు వాటిని సరదాగా తీసుకుంటారు. మరికొందరు ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ నుంచి అనుకోని ప్రశ్న బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డికి ఎదురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అషు రెడ్డి.. సోషల్ మీడియాలో తన ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తుంది. తన అందచందాలతో కుర్రకారులకు నిద్ర పట్టనివ్వదు. అదీ కాక బిగ్ బాస్ షో తో తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకుంది. హీరో పవన్ కళ్యాణ్ పేరును టాటూగా తన శరీరంపై వేయించుకుని హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఈ అమ్మడు సంచలనం సృష్టించింది. అయితే తాజాగా అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ ఏ క్వషన్ అంటూ.. సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.
చిట్ చాట్ లో భాగంగా ఈ ముద్దు గుమ్మకు ఓ వింత ప్రశ్న ఎదురైంది. చాలా మంది నెటిజన్స్ ఆమెను క్వశ్చన్స్ అడిగారు. ఓ నెటిజన్ ఆమె బిగ్ బాస్ లో వేసుకున్న డ్రెస్ గురించి చెప్పగా .. బాగానే గుర్తు పెట్టుకున్నారు అంది. ఇక మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మీకు తెలిదా? టాటూ కూడా ఉంది. అంటూ సమాధానం ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు అని అడగ్గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంటూ సమాధానం ఇచ్చింది.
ఓ నెటిజన్ మాత్రం కాస్త విచిత్రంగా ఆర్ యూ వర్జీన్ అని అడిగాడు. దానికి అషు రెడ్డి అవును నేను కన్యనే అంటూ వెక్కిరిస్తూ, నవ్వుతూ చెప్పింది. ఇలాంటి ప్రశ్న ఎదురౌతుందని పాపం అషు రెడ్డి ఊహించి ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు తారలకు జరగడం సహజమే. నెటిజన్ ప్రశ్నకు అషు స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.