Vishwak Sen: కంటెంట్‌లో దమ్ము ఉంటే ఎన్ని వివాదాలు వచ్చినా ఏమీ కాదని ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా మరోసారి నిరూపించింది. వరుస వివాదాల నడుమ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో హీరో విశ్వక్ సేన్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. శుక్రవారం ఉదయం సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకోవటానికి థియేటర్ల చుట్టూ తిరిగాడు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావటంతో ఊపిరి పీల్చుకున్నాడు. సినిమా సక్సెస్ సాధించిందన్న సంతోషంలో తీన్‌మార్ స్టెప్పులకు డ్యాన్స్ వేశాడు. సినిమా టీంతో కలిసి రచ్చరచ్చ చేశాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. మరి, విశ్వక్ సేన్ తీన్‌మార్ స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Review Laxman: వద్దు సమాజానికి అనవసరమైన న్యూస్! నా చేతిలో ఉంది మ్యాంగో జ్యూస్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.