సాధారణ ప్రజలు అయినా స్టార్ సెలబ్రిటీలు అయినా సరే కొన్ని విషయాలు చాలా కామన్ గా ఉంటాయి. అవి బయటపడినప్పుడే.. వీళ్లకు ఇలా జరిగిందా, అంతలా బాధపడ్డారా అని సగటు నెటిజన్ మాట్లాడుకుంటాడు. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ షాకింగ్ విషయాల్ని బయటపెట్టింది. తన బాయ్ ఫ్రెండ్.. దవడ విరిగేలా కొట్టాడని, ఓ సందర్భంలో అయితే చనిపోతానని భయపడ్డానని అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది?
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల కాలంలో శ్రద్ధా వాకర్ హత్య కేసు తీవ్రదుమారం రేపింది. దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి మాట్లాడారు. ఇక టాలీవుడ్ లక్స్ పాప, ప్రముఖ నటి ఆశా సైనీ.. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దారుణమైన గృహహింస గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 2007లో తన బాయ్ ఫ్రెండ్ గౌరంగ్ జోషి.. తనని చిత్రహింసలకు గురిచేశాడని పేర్కొంది. తీవ్రమైన లైంగిక వేధింపులకు కూడా అతడు పాల్పడినట్లు బయటపెట్టింది. 2018లో మీటూ ఇష్యూ టైంలో కొన్ని విషయాలు చెప్పిన ఆశా సైనీ.. తాజాగా మరో ఇంటర్వ్యూలో తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.
‘శ్రద్ధా వాకర్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో నాకు కూడా అలాంటిదే జరిగింది. నా బాయ్ ఫ్రెండ్, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకొచ్చిన కొద్దిరోజుల్లోనే అతడిలో చాలా మార్పు కనిపించింది. తనకోసం అందరినీ వదిలేసి వస్తే.. నన్ను తీవ్రంగా హింసించేవాడు. పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించేవాడు. ఎందుకు కొడుతున్నాడో అర్థమయ్యేది కాదు. ఓ రోజైతే.. అతడి కొట్టిన దెబ్బలకు నా దవడ విరిగింది. ఓరోజు దారుణంగా కొట్టడంతో చనిపోతాననుకున్నా. ఒంటిపై బట్టలు ఉన్నాయా లేదా అని చూడకుండా ప్రాణభయంతో పరుగెట్టా. తర్వాత రోజే అతడిపై కేసు పెట్టాను. తొలుత పోలీసులు నేను చెప్పింది నమ్మలేదు. రాతపూర్వక కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్నారు’ అని ఆశా సైనీ చెప్పింది. ఇదిలా ఉండగా నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ లాంటి తెలుగు సినిమాల్లో నటించిన ఈమె.. హిందీ, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్, సహాయ పాత్రలు చేసింది.