ది లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది లెజెండ్’. ఈ మూవీని ఆయనే స్వయంగా శరవణ ప్రొడక్షన్స్ పేరిట రూ.80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. జేడీ- జెర్రీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో గీతిక, ఊర్వశీ రౌతెలా, ప్రభు, వివేక్, నాజర్ వంటి ప్రముఖ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో నటించారు.
దేశానికి సేవ చేయాలనుకునే ప్రముఖ శాస్ర్తవేత్తగా శరవణన్ నటించారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. ఈ సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అనేదానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రాల వారీగా అసలు ది లెజెండ్ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.
ది లెజెండ్ మొదటి రోజు కలెక్షన్స్:
ఈ ప్రకారం అరుళ్ శరవణన్ ది లెజెండ్ సినిమా బ్రేక్ ఈవెన్ సంగతి పక్కన పెడితే అసలు 25 శాతం బడ్జెట్ కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు. కానీ, హీరో కావాలనే కల మాత్రం అరుళ్ శరవణన్ నెరవేర్చుకున్నారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ పాన్ ఇండియా సినిమా అనేది అరుళ్ శరవణన్ పాన్ ఇండియా బిజినెస్ కి తొలి అడుగు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి సినిమాతో లాసులు వచ్చినా అరుళ్ మాత్రం ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యారంటున్నారు. ది లెజెండ్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.