‘ది లెజెండ్’.. పాన్ ఇండియా స్థాయిలో ఏ స్టార్ సినిమాకి రాని బజ్ ఈ సినిమాకి వచ్చింది. కారణం.. ఎవరన్నా హీరో అయ్యాక వ్యాపారాల్లోకి దిగుతారు. కానీ, లెజెండ్ శరవణన్ మాత్రం ముందు వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యాక ఐదు పదుల వయసు దాటాక హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అది కూడా మొదటి చిత్రమే రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తీశారు. స్వతహాగా యాక్టింగ్ అంటే ఇష్టంతోనే లెజెండ్ శరవణన్ ఈ ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శన ముగిసింది. మరి ఎంతమేర నష్టాలు వచ్చాయో చూద్దాం.
ది లెజెండ్ సినిమాకి రూ.80 కోట్ల భారీ బడ్జెట్ అని అందరికీ తెలిసిందే. హీరోయిన్ ఊర్వశీ రౌతెలాకే రూ.20 కోట్లు ఇచ్చారంటూ ప్రచారాలు జరిగాయి. కానీ, తర్వాత వాటిని ఆమె ఖండించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అనేది మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.7.82 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు వరకు అయితే ది లెజెండ్ శరవణ స్టోర్స్ లో దుస్తులు కొన్నవారికి సినిమా టికెట్లు బహుమతిగా ఇచ్చారు. అలా చూసుకున్నా కూడా 10 శాతం కూడా రికవర్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఇలా చూసుకుంటే ఈసారి తీసే సినిమా బడ్జెట్ అదుపులో ఉంచుకుంటే మంచిదంటూ సూచనలు చేస్తున్నారు.
ఇదిలా ఉన్నా సినిమా డిజాస్టర్ గా మిగిలినా కూడా ది లెజెండ్ శరవణ స్టోర్స్ కు పాన్ ఇండియా స్థాయిలో మంచి పబ్లిసిటీ లభించింది. అలా చూసుకుంటే సినిమాలో వచ్చిన లాస్ కంటే లాభాలే ఎక్కువని చెబుతున్నారు. ఏదైనా అరుళ్ శరవణన్ మాత్రం ఒక గొప్ప వ్యాపారవేత్త అని మరోసారి రుజువు చేసుకున్నారు. ది లెజెండ్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.