కరాటే కళ్యాణి.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. అనేక పాత్రల్లో కళ్యాణి నటించారు. తనదైన నటనతో , మాటలతో ప్రేక్షకుల మదిలో మంచి పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన ‘కృష్ణ’ సినిమాలో ఆమె చేసిన పాత్ర.. అప్పటి వరకు మాములుగా ఉన్న కళ్యాణికి ఓ రేంజ్ లో ఫేమస్ చేసింది. ఆ సినిమా తరువాత నుంచి ఆమె కనిపిస్తే చాలు.. బాబీ.. అంటూ ప్రేక్షకులు అంటుంటారు. సినిమాలు చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు. కొన్ని నెలల క్రితం ఓ యూట్యూబర్ తో జరిగిన ఇష్యూతో కరాటే కళ్యాణి వార్తలో నిలిచారు. ప్రస్తుతం పలు సినిమాల్లో సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. అయితే తాను ఓ పాత్రలో నటించిన కారణంగా వ్యభిచారిలాగా చూస్తున్నారని కళ్యాణి ఆవేదన చెందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణి.. ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక తన వ్యక్తిగత, సినీ జీవితంకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు.
వైవాహిక జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని, తాగుబోతు భర్త నరకం చూపించాడని, అయినా భర్త కాబట్టి భరించానని కళ్యాణి తెలిపారు. అర్ధరాత్రి తాగొచ్చి వండి పెట్టమంటే చేశానని ఆమె అన్నారు. అంతేకాక వివాహ బంధం తనకు కలిసి రాలేదని అందుకే విడాకులు తీసుకున్నానట్లు ఆమె తెలిపారు. ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలే చేస్తుందని యాంకర్ అడిగిన ప్రశ్నకు కళ్యాణి క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ..”బతుకుతెరువు కోసం నేను సినిమాల్లో నటిస్తున్నాను. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాను. ఎక్కువ మంది నాలో బాబినే చూశారు. కానీ నాలో మరోకోణం కూడా ఉంది. నిజజీవితంలో నేను చాలా మందికి సాయం చేశాను. వారంతా నన్ను చాలా గౌరవ ఇస్తారు. ఇక నేను సింగింగ్, హరికథ, డ్యాన్స్, యాంకరింగ్, జింగిల్స్ పాడటం వంటివి అన్ని చేశాను. ఇండస్ట్రీలోకి వచ్చాక.. బతకడం కోసం.. డబ్బింగ్ చెప్పడం.. జింగిల్స్ పాడటం చేశాను” అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.
అయితే తనలోని మంచి వ్యక్తిని గుర్తించకుండా కొందరు తనపై చేసే కామెంట్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన చెందారు. సినిమాల్లో తాను చేసే పాత్రలు చూసి అలానే ట్రీట్ చేస్తున్నారని సమాజం తనను వ్యభిచారిగా చూస్తుందని కళ్యాణి బాధపడ్డారు. నిజానికి తాను అలాంటి దాన్ని కాదని, ఎప్పుడూ ఎలాంటి తప్పుడు పనులు చేయలేదని ఆమె అన్నారు. తన వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని కానీ ఈజీగా మాటలు అనేస్తారంటూ కళ్యాణి చెప్పుకొచ్చారు. మరీ.. కరాటే కళ్యాణి.. తన గురించి చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.