హేమ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి. ఆమె విలక్షణ నటన, కామెడీ టైమింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా మనసులో ఏమున్నా హేమ ఓపెన్‌గా పైకి చెప్పేస్తుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ పబ్ వ్యవహారం అడపాదడపా సోషల్ మీడియాలోనో.. జనాల మాటల్లోనో నలుగుతూనే ఉంది. తాజాగా అదే వ్యవహారంపై ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి హేమ తనదైనశైలిలో స్పందించింది. తనకు సంబంధంలేని వ్యవహారంలోకి లాగి నానా రాద్దాంతం చేశారంటూ వాపోయింది. ఆరోజు తన భర్త తనతోనే ఉన్నాడని.. లేకుంటే ఆయన కూడా అదే నిజమని నమ్మే పరిస్థితి అని చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారంపై పరువునష్టం దావా వేయనున్నట్లు హేమా కామెంట్ చేసింది.
ఇదీ చదవండి: ‘నా భార్య నా రక్తం తాగుతోంది.. ట్రీట్‌మెంట్ ఉందా’.. సోనూ సూద్ రిప్లై వైరల్!
‘నాకు పబ్ కు వెళ్లె అలవాటు లేదని నేను చెప్పను. నేను గాలిదాన్ని.. అక్కడ మ్యూజిక్ ఎంజాయ్ చేశామా, నాలుగు గెంతులేశామా అనే బాపతి. నేను తాగను.. నాకు అలవాటు లేదు, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు. నా ఎంజాయ్ మెంట్ వేరేలా ఉంటుంది. నాకు స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఇష్టం. స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తాను. పబ్ కి వెళ్తాను కానీ, ఉగాదిరోజు నేను పబ్ కు వెళ్లలేదు.. మా వారితోనే గడిపాను. ఒకవేళ నేను మా వారితో లేకపోతే ఆయన కూడా నేను పబ్ కెళ్లాను అని నమ్మేలా మీడియాలో ప్రచారం చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది. హేమ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజయజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.