Arnav: తమిళ నటులు దివ్య, అర్నవ్‌ల కేసులో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. అర్నవ్ మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అర్నవ్, దివ్యను పెళ్లి చేసుకోవటానికి ముందే అతడికి పెళ్లయిందని సమాచారం. ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకున్న అతడు తర్వాత ఆమెను వదిలేసినట్లు సమాచారం. ప్రస్తుతం అర్నవ్ మాజీ భార్య అయిన ట్రాన్స్‌జెండర్ ప్రియదర్శినికి సంబంధించిన ఓ ఆడియో వైరల్‌గా మారింది. ఆ ఆడియోలో తమ పరిచయం, పెళ్లి, విడిపోవటం గురించి ప్రియదర్శిని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు, అర్నవ్‌కు టీ నగర్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పదేళ్ల క్రితం ఇద్దరం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. వైవాహిక బంధంలో కొన్ని నెలలు బాగానే గడిపాం. తర్వాతినుంచి అతడి వేధింపులు మొదలయ్యాయి.
అతడు వేరే మహిళలతో క్లోజ్‌గా ఉండేవాడు. నన్ను బాగా కొట్టేవాడు. ఎనిమిదేళ్లు అతడి వేధింపులు భరించాను. తర్వాత ఇద్దరం విడిపోయాం’’ అని పేర్కొంది. కాగా, అర్నవ్, దివ్యలకు 2017లో పరిచయం అయింది. ‘కేలాడి కన్మణి’ సీరియల్ షూటింగ్ సమయంలో ఇద్దరూ కలిశారు. దివ్యకు అప్పటికే పెళ్లయి పాప కూడా ఉంది. భర్తతో విడాకులు తీసుకుని ఆమె వేరుగా ఉంటోంది. ఈ విషయం అర్నవ్‌కు తెలుసు. అయినా దివ్యతో క్లోజ్‌గా ఉండటం మొదలుపెట్టాడు. తర్వాత కొద్ది కాలానికి వీరిద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి ఓ ఫ్లాట్ కూడా తీసుకున్నారు. 2022, జూన్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత దివ్య గర్భం దాల్చింది.
ఈ విషయం తెలిసినప్పటినుంచి అర్నవ్ ఆమెను దూరం పెడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దివ్యకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. అర్నవ్ మరో నటితో ప్రేమలో ఉన్నాడని తెలిసింది. దీంతో అర్నవ్ సదరు నటితో షూటింగ్‌లో ఉండగా దివ్య అక్కడికి వెళ్లింది. గదిలో వారిద్దరూ ఉండగా నిలదీసింది. ఆ గదిలో వారితో దివ్యకు గొడవైంది. సదరు నటి దివ్యపై చెయ్యి కూడా చేసుకుంది. దివ్య ముందే అర్నవ్‌కు ముద్దుకూడా పెట్టింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దివ్యను కొట్టినందుకు గానూ అర్నవ్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి: నటికి చేదు అనుభవం.. ‘క్యాబ్ డ్రైవర్ తప్పుగా ప్రవర్తించాడు.. భయపెట్టాడు’!