ప్రముఖ నటి అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దర్శకుడు అట్లీ దంపతులకు కూడా ఈ ఏడాది జనవరిలో పండంటి మగ బిడ్డ జన్మించాడు. అలాగే టీవీ యాక్టర్స్ లాస్య మంజునాథ్, వైష్ణవి కూడా బిడ్డలకు జన్మనిచ్చారు. తాజాగా ప్రముఖ నటుడు తండ్రి అయ్యాడు.
సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా గుడ్ న్యూస్ షేర్ చేస్తున్నారు. ప్రముఖ నటి అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దర్శకుడు అట్లీ దంపతులకు కూడా ఈ ఏడాది జనవరిలో పండంటి మగ బిడ్డ జన్మించాడు. అలాగే టీవీ యాక్టర్స్ లాస్య మంజునాథ్, వైష్ణవి కూడా బిడ్డలకు జన్మనిచ్చారు. తాజాగా ప్రముఖ నటి ఇలియానా కూడా తాను ప్రెగ్నెంట్ అని చెప్పకనే చెప్పింది. అదేవిధంగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో రెండు నెలల్లో తండ్రిగా ప్రమోట్ కాబోతున్నాడు. కాగా, ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్, నటుడు ఇంట్లో ఒకరి రాకతో ఆనందాలు వెల్లివిరిస్తున్నాయి. ఇంతకు వారి జీవితంలోకి ఎవరు వచ్చారంటే..
బాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్, నటుడు అర్మాన్ జైన్ తండ్రి అయ్యారు. ఆయన భార్య అనిస్సా మల్హోత్రా ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నటుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. అర్మాన్ జైన్ ప్రముఖ సీనియర్ నటి నీతాకపూర్‌కు స్వయంగా మేనల్లుడు. ఆమె కూడా ఈ దంపతులకు మగబిడ్డ పుట్టాడంటూ తన ఇన్ స్టా స్టోరీలో తెలిపింది. కరీనా కపూర్ బంధువు అయిన అర్మాన్ జైన్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. లెకర్ హమ్ దీవానా దిల్ హీరోగా మారారు. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతూ వారితో ఉన్న ఫోటోలను కరీనా కపూర్ పంచుకున్నారు. ఈ శుభవార్త విన్న పలువురు బాలీవుడ్ తారలు ఈ జంటకు అభినందనలు తెలిపారు. అర్మాన్, అనిస్సా ఫిబ్రవరి 2020లో వివాహం చేసుకున్నారు. ఇటీవలే సన్నిహితులు, కుటుంబ సభ్యులు సమక్షంలో బేబీ షవర్‌ను నిర్వహించారు.