ఆమె ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత ఎందుకో కెరీర్ ని సరిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. మరి ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
ఆమె చూడటానికి చాలా నార్మల్ గా ఉంటుంది. కానీ స్టార్ హీరోలు చెప్పాలంటే సూపర్ స్టార్స్ తో నటించింది. టీనేజ్ లోనే యాక్టర్ అవ్వాలని ఉందని ఇంట్లో చెప్పింది. కానీ ఒప్పుకోకపోవడంతో గొడవపడి మరీ బయటకొచ్చేసింది. అలా ఎన్నో కష్టాలు పడుతూ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో చేసిన ఫస్ట్ మూవీతోనే ఏకంగా పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ప్రతి ఏడాది 100కి పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ఎప్పుడు ఏ మూవీ హిట్ అవుతుందనేది అస్సలు చెప్పలేం. స్టార్ హీరోల మూవీస్ హైప్ వల్ల వసూళ్లు సాధించొచ్చు గానీ మిడ్ రేంజ్ చిత్రాల చూడాలంటే కచ్చితంగా కంటెంట్ ఉండాల్సిందే. అలాంటి స్టోరీతో వచ్చి హిట్ కొట్టి, టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. అందులో హీరోయిన్ గా చేసిన షాలినీ పాండేనే పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి. ఈ మూవీతో విజయ్ దేవరకొండతోపాటు షాలినీ పాండే కూడా చాలానే క్రేజ్ సంపాదించింది.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత షాలినీ పాండే కెరీర్.. టాలీవుడ్ లో అంతంత మాత్రంగానే సాగింది. మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం సినిమాలు చేసింది. 2018లోనే ‘మేరీ నిమ్మో’తో హిందీలోకి ఎంటైంది. ఆ తర్వాత బంఫాద్, జయేష్ భాయ్ జోర్దార్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ‘మహారాజా’ అనే హిందీ మూవీ చేస్తోంది. కెరీర్ లో అనుష్క, విజయ్ దేవరకొండ, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్స్ కలిసి పనిచేసింది. కానీ సరిగా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్లనే ఏమో ప్రస్తుతం పెద్దగా బయట కనిపించట్లేదు. మరి ఈ బ్యూటీ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.