'అర్జున్ రెడ్డి'లో విజయ్ కి ఫ్రెండ్ ఒకామె యాక్ట్ చేసింది. అందులో కళ్లద్దాలతో కనిపించిన ఆ భామ.. ఇప్పుడు గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తోంది. ఇంతకీ ఏంటి సంగతి?
ఓ సాధారణ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన మూవీ ‘అర్జున్ రెడ్డి’. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. చెప్పాలంటే విజయ్ కెరీర్ ని మార్చి పడేసింది. ఇందులో బోల్డ్ సీన్స్, బూతులు ఎక్కువగా ఉండొచ్చు కానీ ప్రేమ గురించి అంతే బాగా చూపించారు. హీరోహీరోయిన్లు కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. ఇందులో ఫ్రెండ్స్ యాక్ట్ చేసిన వాళ్లు ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిపోయారు. అందులో నటించిన ఓ అమ్మాయి మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
ఇక విషయానికొస్తే.. తెలుగులోకి ప్రతి ఏడాది హీరోయిన్లతోపాటు బోలెడంతమంది కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి, పేరు తెచ్చుకున్నా సరే ఆ తర్వాత అవకాశాలు తెచ్చుకోవడానికి మాత్రం తెగ కష్టపడుతుంటారు. అలాంటి అమ్మాయే అతిథి మ్యాకల్. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈమె.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండటంతో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది.
కెరీర్ లో ఓ ఎనిమిది సినిమాలు చేసింది. అందులో ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ కాస్త గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించింది. 2021లో చివరగా ఓ రెండు సినిమాల్లో యాక్ట్ చేసిన అతిథి.. ఆ తర్వాత ఛాన్సులు రాకపోవడం గ్లామర్ షోకి పరిమితమైంది. ఆమె ఇన్ స్టా చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఏ మాత్రం అడ్డుచెప్పకుండా మత్తెక్కించే పోజుల్లో నెటిజన్స్ ని కవ్విస్తుందనే చెప్పాలి. తాజాగా అలాంటి ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో ‘అర్జున్ రెడ్డి’ ఎంతలా మారిపోయిందో అని తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి అతిథి మ్యాకల్ ప్రెజెంట్ పిక్ చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.