ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవచ్చునని పెళ్ళికి ముందే లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటారు. సెట్ అయితే పెళ్లి, లేదంటే లొల్లి పెట్టుకుని మరో లివింగ్ పార్టనర్ ని వెతుక్కుంటారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండే ఇది. ఈ విషయంలో సినిమా వాళ్ళు ముందుంటారు. అందులోనూ బాలీవుడ్ సెలబ్రిటీలు ముదురు బెండకాయల మాదిరి అందరికంటే ముందుంటారు.. వెస్టర్న్ కల్చర్ ని అడాప్ట్ చేసుకున్న సంఘానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్టు.. ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది లివింగ్ రిలేషన్ షిప్ పేరుతో సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. ఇదెప్పుడూ ఉండేదే. అయితే బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మలైకాతో లివింగ్ రిలేషన్ షిప్, పెళ్లి విషయాలపై స్పందించారు. అప్పుడే పెళ్ళికి తొందర ఏముంది అని అంటున్నారు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, అసలు పెళ్లి ఇప్పుడు అవసరమా అన్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు.
అర్జున్ కపూర్(37), తన కంటే 11 ఏళ్ల పెద్దదైన మలైకా అరోరా(48)తో ప్రేమ ప్రయాణాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా గతంలో పెళ్లి అయిన నటితో. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ కి 2017లో విడాకులు ఇచ్చేసిన మలైకా.. అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఇక ఈ ఇద్దరూ బీటౌన్ లో భార్యాభర్తల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. పెళ్లి ఒక్కటే తక్కువైందన్న విషయం తప్పితే మిగతా అన్ని విషయాల్లోనూ భార్యాభర్తల్లానే ప్రవర్తిస్తున్నారు. దీంతో నేషనల్ మీడియా ఈ ఇద్దరికీ చాలా సందర్భాల్లో పెళ్లి చేయాలని భావించింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు, కథనాలు రాస్తూ వస్తుంది. తాజాగా ఈ వార్తలపై అర్జున్ కపూర్ స్పందించారు. తమకి పెళ్లి చేసుకునే మూడ్ ఇప్పట్లో లేదని, దయచేసి మీడియా వాళ్ళు తమకి తెలియకుండా పెళ్లి చేయకండి అన్నట్టు ఆయన మాట్లాడారు.
కాఫీ విత్ కరణ్ షోకి గెస్ట్ గా వెళ్లిన అర్జున్ కపూర్.. మలైకాతో ప్రేమ, పెళ్లి విషయాల గురించి ప్రస్తావన రావడంతో వాటిపై స్పందించారు. తాను మలైకాను ఇప్పట్లో పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేనని, ప్రస్తుతం కెరీర్ మీదే ఫోకస్ చేశానని అన్నాడు. కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా రెండేళ్ల పాటు సినిమాలు లేక సంతోషం లేదని, ఏదో అలా సమయం గడిచిపోయిందని, ఇప్పుడు కెరీర్ పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తన పని తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని, తాను సంతోషంగా ఉంటేనే తన భాగస్వామిని సంతోషపెట్టగలనని అన్నారు. అందుకే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలు లేవని పేర్కొన్నారు. సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా ఈ జంట మాత్రం తగ్గేదేలే అన్నట్లు తమ రిలేషన్ షిప్ ని కొనసాగిస్తున్నారు. మరి ఈ జంటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.