ఈ మధ్య బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ మరీ ఎక్కువైంది. బాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. సోషల్ మీడియా మొత్తం బాయ్‌కాట్ బాలీవుడ్ మూవీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాలు రిలీజవుతున్నప్పుడు కూడా ఇలానే బాయ్‌కాట్ అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు స్పందించారు. అయినప్పటికీ ట్రెండ్ మారలేదు. ఇది ఆ సినిమాలపై బాగా ప్రభావం చూపించింది. అయితే ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ స్పందించారు. బాయ్‌కాట్ ట్రెండ్ విషయంలో మేమే తప్పు చేశామని, ఈ మధ్యన బాగా ఈ పదాన్ని కొందరు పనిగట్టుకుని ట్రెండ్ చేస్తున్నారని అన్నారు.
మేము దాన్ని పట్టించుకోలేదని, పట్టించుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు. దీనిపై మేము చర్యలు తీసుకోకపోవడాన్ని కొంతమంది అవకాశంగా తీసుకుంటున్నారని, సైలెంట్‌గా ఉంటే చేతకానితనంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన వార్తలు, హ్యాష్‌ట్యాగ్స్ క్రియేట్ చేస్తూ బాలీవుడ్ నటులపై బురద జల్లుతున్నారని, దీనిపై సినిమా వాళ్ళందరూ స్పందించాలని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్జున్ కపూర్ అన్నారు. దీంతో నెటిజన్లు ఎవరీ అర్జున్ కపూర్ అంటూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. మీ కోసం పని మానుకుని, పనిగట్టుకుని మీ టాలెంట్‌ని ఆపేందుకు మేమేమైనా పిచ్చోళ్ళమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
#ArjunKapoor After Sleeping with All his Sister’s (Male) Friend including Karan Johar pic.twitter.com/jeFXiSYYxX
— Indic Spectrum (@IndicSpectrum) August 17, 2022
ఈ దేశం మీద, మా సంస్కృతి మీద ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా కామెంట్స్ చేస్తే ఇలానే ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ అనేది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి మొదలైందని, అప్పుడే బాలీవుడ్ పతనం మొదలైందని అంటున్నారు. ఇది బాలీవుడ్ సినిమాలపై, బాలీవుడ్ హీరోలపై విరక్తి చెందిన ప్రేక్షకులే ఈ విధంగా బాయ్‌కాట్ బాలీవుడ్ అనే పదాన్ని ట్రెండ్ చేస్తున్నారే తప్ప ఇందులో ప్రత్యేకించి ఎలాంటి కుట్రలూ లేవని.. అర్జున్ కపూర్ బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ మీద రివేంజ్ తీర్చుకుంటే.. ఆడియన్స్ మీద తీర్చుకున్నట్టే అని సెటైర్లు విసురుతున్నారు. మరి బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్‌పై కామెంట్స్ చేసిన అర్జున్ కపూర్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
People taking advantage of our silence Arjun Kapoor on Boycott Bollywood #ArjunKapoor #Boycottbollywood pic.twitter.com/UHIKKPDPnt
— Devil V!SHAL (@VishalRC007) August 16, 2022