అరియాన.. బుల్లితెరపైకి అన్యూహ్యంగా దూసుకొచ్చిన కొత్త అందం. మీడియా హౌసెస్ లో యాంకర్ గా ఇంటర్వూస్ చేస్తూ ఉండేది ఈ అమ్మడు. అనుకోకుండా ఒకసారి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. అసలే ఓపెన్ మైండ్ తో ఉండే ఆర్జీవీని.. ఇంకాస్త బోల్డ్ ప్రశ్నలు అడిగి రెచ్చకొట్టింది అరియాన. దీంతో.., ఈ బుల్లిపిట్టపై ఆర్జీవీ హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయాడు. నిన్ను బికినీలో చూడాలని ఉంది, నా సినిమాలో ఆఫర్ ఇస్తాను చేస్తావా అంటూ ఆర్జీవీ రచ్చ రచ్చ చేసేశాడు. ఇంతే.., సింగిల్ ఇంటర్వ్యూతో అరియనాకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఆ ఫేమ్ తోనే బోల్డ్ బ్యూటీగా అరియనా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా అరియనా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నుండి బయటకి వచ్చాక.., కొన్ని షోలతో బిజీ అయ్యింది ఈ హాట్ యాంకర్. ఆ తరువాత రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా ఆఫర్ కూడా పట్టేసింది. కానీ.., ఇంత పేరు వచ్చినా.., యాంకర్ గా మాత్రం అరియనా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.
అరియాన తాజాగా మరోసారి రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసింది. అయితే.., ఇది మిగతా అన్నీ ఇంటర్వూస్ లా సాగే టాక్ షో కాదు. హాట్ షో. అవును.. ఈ ఇంటర్వ్యూ పేరు “అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ”. టైటిల్ లోనే ఇంత బోల్డ్ ఉంటే ఇక ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తాజాగా ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో బయటకి వచ్చింది. ఇందులో మాటలు ఏవి లేవు. ఆర్జీవీ, అరియనా రెచ్చిపోయి జిమ్ చేసే విజువల్స్ మాత్రం అద్భుతంగా వచ్చాయి. టైట్ ఫిట్ స్పోర్ట్ డ్రెస్ లో అరియానా అందాల కవ్వింత.., ఆర్జీవీ దగ్గరుండి ఆమె చేత జిమ్ చేయించే షాట్స్ హీట్ పెంచుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూ విషయంలో ఆర్జీవీ ట్వీట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. “హే అరియాన నువ్వు ఇచ్చిన బోల్డ్ ఇంటర్వ్యూ టీజర్ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈ టీజర్ ను విడుదల చేస్తున్నాం” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం విశేషం. మరి ఈ వీకెండ్ లో కుర్రకారుకి “అరియానా టాక్స్ బోల్డ్ విత్ ఆర్జీవీ” మంచి టైమ్ పాస్ అనమాట.