అరియానా గ్లోరీ- అషూరెడ్డి ఈ అమ్మాయిల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరూ అటు సోషల్ మీడియా, ఇటు బుల్లితెర మీద బాగా పాపులర్ అనే చెప్పాలి. అరియానా గ్లోరీ ఎన్నో కష్టాలు పడి బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్‌తో ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయింది. అటు అషూరెడ్డి కూడా టిక్‌టాక్ వీడియోలతో ఫేమ్, ఫ్యాన్ బేస్ పెంచుకుని తర్వాత బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వెండితెర మీద కూడా అడపాదడపా కనిపించి మెప్పించింది. ఇద్దరూ రెండుసార్లు బిగ్ బాస్‌కి వెళ్లివచ్చారు. అందరికీ ఒకసారి అవకాశం రావడమే కష్టంగా ఉంటుంది అయితే.. వీళ్లకి మాత్రం ఆ అదృష్టం రెండుసార్లు తలుపు తట్టింది.
వీళ్లు ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే.. వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. అవును వీళ్లిద్దరూ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసినవాళ్లే. వీళ్ల ఇద్దరికీ ఆ ఇంటర్వ్యూ తర్వాత బోల్డ్ బ్యూటీస్ అనే పేరు కూడా వచ్చింది. వాళ్ల గురించి ఎవరు ఏమనుకున్నా వారికి నచ్చింది మాట్లాడతారు, నచ్చినట్లుగానే ఉంటారు. వీళ్లు ఇద్దరిలో ఇలాంటి చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టేనేమో.. వీళ్లు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వీళ్ల బాండింగ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేవారికి వారి ఫొటోలు తరచూ కనిపిస్తూనే ఉంటాయి.
తాజాగా అషూరెడ్డి– అరియానా గ్లోరీ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు బోల్డ్ గా ఉండటమే కాదు.. కొంచం తేడాగా కూడా ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. పొట్టి డ్రెస్సుల్లో ఉండటమే కాకుండా.. ఒకరిపై వాలిపోతూ ఉన్నారు. రెండు ఫొటోల్లో అయితే అరియానా చంకనెక్కింది అషూరెడ్డి. వీళ్లు ఇంత క్లోజ్‌గా ఉండటం చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. కొందరు మీ ఫ్రెండ్‌షిప్ ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండాలి అని కోరుకుంటే. ఇంకొందరు మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్ల గురువుగారు ఆర్జీవీ డేంజరస్ సినిమా చూసినట్లుందని కొందరు, త్వరలోనే పెళ్లి చేసుకుంటారా? ఇంకొందరు వెటకారం చేస్తున్నారు. మీ ఇద్దరితో ఆర్జీవీ ఉండాలి కదా.. హరి ఉన్నాడేంటని ఇంకొందరు అసహనం వ్యక్తం చేశారు.