బిగ్ బాస్.. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ గేమ్ షో కాన్సెప్ట్.. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతి భాషలో విజయం సాధించింది. తెలుగులోనూ బిగ్ బాస్ కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో 5 సీజన్లు, బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలోనూ ఓ సీజన్ నిర్వహించారు. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమం వల్ల ఎంతో మందికి సెలబ్రిటీ హోదా లభించింది. నిజానికి వారు సెలబ్రిటీలనే లోపలికి తీసుకెళ్తారు.. కానీ, ఆ షో తర్వాత వారి రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే అరియానా గ్లోరీ, యాంకర్ శివలకు సెలబ్రిటీ హోదా, గుర్తింపును బిగ్ బాస్ తెచ్చిపెట్టింది.
కాంట్రవర్సీ శివగా బిగ్ బాస్ లోకి వెళ్లి.. తన గేమ్, ప్రవర్తనతో యాంకర్ శివ ప్రేక్షకుల్లో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. అరియానా అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ తో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ లోనూ తన అదృష్టం పరీక్షించుకుంది. రెండుసార్లు కూడా నాలుగో స్థానాన్ని పొందింది. అంతేకాకుండా నాన్ స్టాప్ సీజన్లో రూ.10 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చి తెలివైన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం బిగ్ బాస్ తర్వాత ఇంట్లోని సభ్యులంతా బయట పార్టీలు, మీటింగులు, చాటింగులు అంటూ సరదాగా గడిపేస్తున్నారు. అందులో భాగంగానే అరియానా గ్లోరీ– యాంకర్ శివ ఇద్దరూ కలిసి రామ్ పోతినేని- కృతిశెట్టి నటిస్తున్న వాంటెడ్ సినిమాలోని ‘కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్’ అనే ట్రెండింగ్ ట్రాక్ కు సిగ్నేచర్ స్టెప్పులేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ రీల్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అరియానా- యాంకర్ శివ డాన్సుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.