బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో ద్వారా ఫేమ్ లోకి వచ్చిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏ రేంజిలో రచ్చ చేస్తుంటారో తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా పరిచయమై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ అరియానా గ్లోరి, అషురెడ్డిల లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అషురెడ్డి ఇంస్టాగ్రామ్ లో అరియానా నడుము పై ముద్దాడుతున్న పిక్ పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటో చూసినవారంతా అరియానా అందం పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఆ ఫోటో పై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఆ ఫోటో పెట్టి క్యాప్షన్ గా.. అద్భుతమైన ఎక్సప్రెషన్ అంటూనే ‘ద్వేషించేవారు ద్వేషించండి.. కానీ మేము మాత్రం ప్రేమిస్తాం’ అని హ్యాష్ ట్యాగ్స్ జతచేసింది అషురెడ్డి. తన ఫోటో పై అరియానా కూడా కామెంట్ చేస్తూ.. ‘ఒసేయ్ అషు.. నీకు నీ పిచ్చికి దండమే తల్లి! అందరూ తప్పుగా అనుకుంటున్నారు. జడ్జిమెంటల్ అవుతున్నాం. ఏదేమైనా నువ్ ఒక క్రేజీ విమెన్’ అని రాసుకొచ్చింది.
సోషల్ మీడియాలో అరియానా, అషురెడ్డి లపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ఫోటోలో వారిద్దరిని చూస్తుంటే ఏదో టీవీ ప్రోగ్రాంలో పెర్ఫర్మ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అరియానా, అషురెడ్డి ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రాంలతో పాటు సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి అరియానా, అషురెడ్డిల పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.