సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తిగా చూస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికిన చాలు తమ అభిమాన హీరోను తాకేందుకు రెడీగా ఉంటారు. తాజాగా ఓ మహిళ కూడా తన అభిమాన గాయకుడిని పట్టుకునే ప్రయత్నంలో గాయపర్చింది.
సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తిగా చూస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికిన చాలు తమ అభిమాన హీరోను తాకేందుకు రెడీగా ఉంటారు. అంతేకాక తమ ప్రాంతంలోకి సెలబ్రిటీ వస్తే భారీగా స్వాగతం పలుకుతూ రచ్చ చేస్తుంటారు. అయితే కొందరు అభిమానులు మాత్రం శృతిమించి ప్రవర్తిస్తుంటారు. తాము అభిమానించే వ్యక్తిని కలుసుకోవాలని అత్యుత్సాహాం చూపిస్తుంటారు. ఇలా వారు చేసే అతి ప్రవర్తన ప్రముఖలను గాయలపాలు చేస్తుంది. తాజాగా ఓ ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ పై ఓ లేడీ ఫ్యాన్ దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఆయన చేయికి తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదివారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని రిద్ధి సిద్ధి ల్యాండ్ మార్క్ లో ప్రముఖ సింగర్ అర్జిత్ సింగ్ స్టేజీ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. ఇక ఆయన ప్రదర్శన ఇస్తున్న సమయంలో అభిమానులు కేరింతలు, ఈలలు వేస్తూ సందడి చేశారు. ఓ యువతి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించింది. ప్రదర్శన ఇస్తున్న సమయంలో అర్జిత్ ను ఓ యువతి చేయి పట్టుకుని కిందకు లాగింది.
ఈ క్రమంలో ఆయన చేతికి గాయమైంది. దీంతో అర్జిత్ సింగ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ..”మీరు చేసిన ఈ పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు ఇక్కడికి సరదాగా గడపడానికి వచ్చారు. అయితే నేను ప్రదర్శన చేయకుంటే మీకు సంతోషం ఎలా వస్తుంది. మీరు నన్ను కిందకి లాగడం వలన నా చేయికి గాయమైంది” అని అన్నారు. అలానే.. నేను ఇక్కడి నుంచి బయలుదేరాలా? అంటూ అనడంతో ప్రేక్షకులందరూ వద్దూ అంటూ గట్టిగా అరిచారు.
అంతేకాక స్టేజిపై నుంచి పలుమార్లు ఆ యువతిని ఉద్దేశించి..తనను ఎందుకు అలా లాగారని చూడండి తన చేయి వణుకుతోందని అర్జిత్ సింగ్ వాపోయారు. చివరకు ఆ యువతి అర్జిత్ కి క్షమాపణలు తెలిపింది. తాను ఎందుకు అలా చేశానో చెప్తేందుకు ప్రయత్నించింది. చివరకు అర్జిత్ సింగ్ ఎంతో నొప్పిని భరిస్తూనే.. తన ప్రదర్శనను తరువాత కొనసాగించారు. ఓ ఇన్ స్టాగ్రామ్ పేజీలో అర్జిత్ సింగ్ చేతికి కట్టుతో కనిపించాడు. ఈ ఘటన గురించి ఆయన అందులో వివరించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.