ఓ స్టార్ హీరోయిన్ ఒక పాపులర్ పొలిటీషియన్తో డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరూ జంటగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. చూపు తిప్పుకోనివ్వని అందం, అందుకు తగ్గట్లే అభినయంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో పరిణీతికి అభిమానులు ఎక్కువ. 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ భల్’ మూవీతో తెరంగేట్రం చేశారు పరిణీతి. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత ‘ఇషక్ జాదే’తో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతోనే ఆమెకు యువతలో క్రేజ్ పెరిగింది. కానీ ఈ మూవీ తర్వాత ఆమె నటించిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. గత కొన్నేళ్లలో పరిణీతికి మంచి హిట్ అంటే ‘కేసరి’ రూపంలో లభించింది. కానీ ఈ మూవీ క్రెడిట్ కాస్తా హీరో అక్షయ్ కుమార్ ఖాతాలోకి వెళ్లిపోయింది.
‘కేసరి’లో అక్షయ్ నటనకు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక, గతేడాది ‘కోడ్ నేమ్: తిరంగా’తో ఆడియెన్స్‌ను పలకరించారు పరిణీతి. కానీ ఈ మూవీ కూడా ఆమెకు సక్సెస్ అందించడంలో ఫెయిలైంది. ఇదిలాఉండగా.. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పరిణీతి డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడితో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాతో ముంబైలో కెమెరాలకు చిక్కింది పరిణీతి. సిటీలోని ఓ రెస్టారెంట్లో నుంచి బయటకు వస్తుండగా వీళ్లిద్దరూ మీడియా కెమెరాల కంటికి చిక్కారు. దీంతో డేటింగ్ రూమర్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దీంట్లో ఎంత నిజం ఉందనేది పరిణీతి, రాఘవల్లో ఎవరు ఒకరు క్లారిటీ ఇచ్చే దాకా తెలియదు.
Actress @ParineetiChopra with Raghav Chadha pic.twitter.com/tSxGXb6j3z
— Atulkrishan (@iAtulKrishan) March 23, 2023