మెగాహీరో రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే టైంలో రెండు సెంటిమెంట్స్ కంగారు పెడుతున్నాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ రావడం ఏమోగానీ హీరోలిద్దరి పేర్లు వరల్డ్ వైడ్ మార్మోగిపోయాయి. కెరీర పరంగానూ చాలా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్న చరణ్.. దీని తర్వాత #RC16 కోసం రెడీ అవుతున్నారు. ఇప్పుడీ సినిమా కోసం ఏకంగా ఆస్కార్ విజేతని తీసుకున్నారట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదే టైంలో ఓ రెండు సెంటిమెంట్స్ మెగాఫ్యాన్స్ ని భయపెడుతున్నాయి. ఇంతకీ ఏంటి విషయం?
ఇక విషయానికొస్తే.. ‘ఆర్ఆర్ఆర్’తో తన ఇమేజ్ ని అమాంతం పెంచేసుకున్న చరణ్, ‘గేమ్ ఛేంజర్’తో దాన్ని డబుల్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. పొలిటిక్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఇంతలో ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లోనూ నటిస్తాడు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ మూవీ స్టోరీ తన కెరీర్ లోనే చాలా వండర్ ఫుల్ స్టోరీ అని చరణ్ కొన్నిరోజుల ముందు చెప్పాడు. దీంతో ఎక్స్ పెక్టేషన్స్ చాలానే ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నారనే న్యూస్ వైరల్ గా మారింది.
ఇప్పటికే ‘స్లమ్ డాగ్ మిలీయనీర్’తో ఆస్కార్ అందుకున్న రెహమాన్ ని.. మ్యూజిక్ డైరెక్టర్ అయితే గ్లోబల్ వైడ్ రీచ్ ఉంటుందని మూవీ టీమ్ బహుశా అనుకుని ఉండొచ్చు. అయితే తెలుగులో రెహమాన్ మూడు సినిమాలు చేశారు. వెంకటేష్ ‘సూపర్ పోలీస్’, మహేష్ బాబు ‘నాని’, పవన్ కల్యాణ్ ‘కొమరం పులి’.. వీటికి రెహమాన్ అందించిన మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమాలు ఫెయిలయ్యాయి. మరోవైపు టాలీవుడ్ లో దాదాపు అందరి డైరెక్టర్స్ రెండో సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ లెక్కన చూసుకుంటే బుచ్చిబాబు రెండో సినిమా చరణ్ తోనే చేస్తున్నాడు. ఇలా ఈ రెండు సెంటిమెంట్స్.. మెగా ఫ్యాన్స్ ని కాస్త కంగారుపెడుతున్నాయి. అదే టైంలో సినిమా సరిగా తీయాలే గానీ ఈ రెండింటిని అధిగమించడం పెద్ద కష్టమేమి కాదని మాట్లాడుకుంటున్నారు. RC16పై వస్తున్న రూమర్స్ గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#ARRahman signed another BIGGIE, but this time in Telugu after a LONG gap🎵🔥#RamCharan‘s next project #RC16 directed by BuchiBabu (Uppena fame)🎬
Shooting begins from September, Said to be Rural Sports Drama💥 pic.twitter.com/EtdAnfKdVN— AmuthaBharathi (@CinemaWithAB) April 9, 2023