మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో సుమారు 200 చిత్రాల్లో నటించి.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి.. ఎమ్మెల్యేగా గెలించింది. ప్రస్తుతం సీఎం జగన్ కేబినెట్‌లో మంత్రిగా విధులు నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు జడ్జీగా వ్యవహరించింది. మరో చానెల్‌లో కూడా ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసింది. ఎక్కడ ఉన్నా తన మార్కుతో ముందుకు వెళ్తుంది రోజా. ఇక శేఖర్ మాస్టర్ పలు సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈయన కూడా గతంలో ఢీ కార్యక్రమానికి జడ్జీగా చేశారు. ప్రస్తుతం కామడీ షోకి జడ్జీగా ఉన్నారు.
ఇక రోజా, శేఖర్ మాస్టర్ కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. సాధారణంగా సెలెబ్రిటీల పిల్లలు చాలా వరకు మంచి స్నేహితులుగా మెలుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రోజా కూతురు అన్షు మాలిక కూడా తల్లి బాటలోనే పయనిస్తూ.. సొంత గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇప్పటికే బుక్స్ రాసి రికార్డు సృఫ్టించింది. అదేవిధంగా శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ పలు డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక వీరిద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.
ఇది కూడా చదవండి: RK Roja : ఒంటరిగా ఉంటున్నా. పిల్లను చూడండి.. మంత్రి రోజాకు వృద్ధుడి విన్నపం..
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ స్నేహితులుగా మారినట్టు తెలుస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను అన్షు తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కుటుంబం అలాగే మంత్రి రోజా కుటుంబం దుబాయ్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి దుబాయ్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రోజా, శేఖర్ మాస్టార్ కుమార్తెల ఫ్రెండ్షిప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: RK Roja: చిరంజీవిని కలిసిన రోజా.. కుటుంబంతో కలిసి మెగా ఫ్యామిలీతో సందడి!